మక్తల్, జనవరి 26 : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మ క్తల్ అభివృద్ధి పరుగులు పెట్టిందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ మున్సిపాలిటీ పాలకవ ర్గం పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆదివారం చిట్టెం రామ్మోహన్రెడ్డి తన నివాసంలో కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు.
బీఆర్ఎస్ సర్కారులో మున్సిపాలిటీలు అభివృద్ధిలో పరుగులు పెట్టాయని చెప్పారు. అభివృద్ధికి పాటుపడిన కౌన్సిలర్లను అభినందించారు. కార్యక్రమం లో మక్తల్ పట్టణాధ్యక్షుడు చిన్నహన్మంతు, మార్కెట్ కమి టీ మాజీ చైర్మన్ రాజేశ్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.