మక్తల్, జూలై 3 : డబుల్ ఓట్లకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో భారత ఎన్నికల సంఘం సర్ కార్యక్రమం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కిరాణాషాపుల్లో కూర్చొ ని బీఎల్వోలను పిలిపించుకొని ఓటరు లిస్టు లు తయారు చేయడం, అక్రమంగా ఓటర్లను నమోదు చేయించడం ఏంటని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్యుమరేటర్లు సర్ నమోదు చేపడుతున్న సర్వేలో మక్తల్ మున్సిపాలిటీలోని 12వ వార్డులో శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఎల్వోలను ఓ కిరాణాషాపులో కూ ర్చోబెట్టుకొని అక్రమంగా ఉన్న ఓటర్లను తొలగించకుండా,
కొంత మంది పేర్లను కూడా అక్రమంగా జోడిస్తున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం హుటాహుటినా అక్కడికి చేరుకొని మీరు చేపడుతున్న ఓటర్ల సరవణ ప్రక్రియ ఇదేనా? ఇలాగేనే ఎన్నికల అధికారులు చేయమంది అని బీఎల్వోను నిలదీశారు. వెంటనే తాసీల్దార్ సతీశ్‌కుమార్‌ను అక్కడికి పిలిపించి ఇదేనా మీరు బీఎల్వోలకు చెప్పిన విధానం.. ఇలాగేనా ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపేదని ప్రశ్నించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఓటర్ల జాబితాలోఅక్రమంగా నమోదు అయిన ఓటర్లను తొలగించడంతోపాటు, ఒకే వ్యక్తి పేరు పలుచోట్ల ఉండడం, మరణించిన వారి పేర్లు కొనసాగడం, నివాసం మార్చుకున్న వారి వివరాలు సకాలంలో సవరించకపోవడం వంటి సమస్యలను పరిష్కారం కోసం ఎన్నికల కమిషన్ సర్ కార్యక్రమం చేపట్టిందన్నారు.
ఇందుకోసం బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ నమోదు చేయా ల్సి ఉండగా మక్తల్‌లోని 12వ వార్డులోని ఓ కిరాణాషాపులో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వారు చెప్పినట్లు బీఎల్వోలే ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో విశ్వసనీయతకు ఖచ్చితమైన ఓటర్ల జాబితా అత్యంత కీలకమని, అర్హులైన వారికి అన్యా యం జరగకుండా, ప్రతి పౌరుడి పేరు జాబితాలో ఉండే విధంగా బీఎల్వోలు విధులు నిర్వహించాలని, అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా ఓటరు సవరణ చేపడితే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం హెచ్చరించారు.