మక్తల్, ఏప్రిల్ 24 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాల ని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం మక్తల్‌లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం మా ట్లాడుతూ గులాబీ దళపతి, మా జీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో 27న వరంగల్‌లో నిర్వహించే సభకు మక్తల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు దండులా బయలుదేరాలని కోరారు.
ఆంధ్రా వలస పాలకుల నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేయాలని కేసీఆర్ సంకల్పించి ప్రా ణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్షకు పూనుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన మహనీయుడుగా అభివర్ణించారు. స్వ రాష్ట్రం సాధించిన తర్వాత పదేండ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి రాష్ట్రం అనేక అభివృద్ధి, సం క్షేమ పథకాలను పరుగులు పెట్టించి దేశంలోనే నెంబర్‌వన్‌గా రాష్ర్టాన్ని నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రంలో అనేక వర్గాల వారు ఆనందంగా ఉన్నారని నేడు కాంగ్రెస్ వచ్చిన 18 నెలలకే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారని ఆరోపించారు. అందుకే రాష్ర్టానికి కేసీఆర్ అవసరాన్ని గుర్తు చేసే లా బీఆర్ఎస్ రజతోత్సవ సభ ద్వారా వెల్లడించే అవకాశం ఉందన్నారు. అందుకే ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.