మానవపాడు, జనవరి 7 : ఒకవైపు తుంగభద్రానది, మరోవైపు కృష్ణానది, జూరాల, ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా సాగునీరు అందుతుందనే ఉద్దేశంతో రైతులు మండలంలోని ఆయా గ్రామాల్లో మిరప పంటను విస్తారంగా సాగు చేశారు. టీబీ డ్యాం, జూరాల రిజర్వాయర్‌లో నీరు లేకపోవడంతో అధికారులు పంటలకు సాగు నీరు అందించలేమని చేతులెత్తేసి క్రాప్ హాలీడే ప్రకటించారు. దీంతో మంచి కాపు దశలో పంటలు ఉండడంతో నీరు లేక పంటలు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉ న్న సమయంలో రైతులకు పంటలు పండించుకునేందుకు సాగు నీరు పుష్కలంగా అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రైతుల సాగునీటికి ఇబ్బందులు మొదలయ్యాయి. వానకాలం లో సాగు చేసిన మిరప రైతులకు సాగు నీరు లేక కన్నీళ్లు మిగల్చనున్నాయి. మానవపాడు మండలంలోని 17 గ్రామాల్లో సుమారు 11,700 ఎకరాల్లో మిరప, 2 వేల ఎకరాల్లో కంది, 400 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న పంటలను సాగు చేశారు. ఏటా జనవరి వరకు సాగునీరు అందుతుండేది. దీనిని దృష్టిలో ఉంచుకొని వానకాలం లో మిరప పంటను విస్తారంగా సాగు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో అక్టోబర్‌లోనే నీటి ఎద్దడి నెలకొన్నది. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి సాగు నీటిని విడుదల చేయించారు. దీంతో పంటలు పండుతాయనే నమ్మకం రైతుల్లో ఉండేది. జూరాల లింకు కాల్వ ద్వారా డీ40 వరకు సా గునీరు అందించాల్సి ఉన్నది. కానీ ఒక్కసారిగా క్రాప్ హాలీడే ప్రకటించడంతో పంటలు పండవని రైతులు ఆం దోళన చెందుతున్నారు. రెండు నదుల మధ్య ఉన్నప్పటి కీ సాగునీరందకపోవడంతో కండ్లముందే పంటలు ఎం డుతుండడం చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
వానకాలంలో సా గు చేసిన మిరప పంట ఇప్పటి వరకు తెగుళ్లతో ఇబ్బందులు పడ్డాం. ఇ ప్పుడిప్పుడే తెగుళ్లు త క్కువ అవుతున్నాయి. ఇంతలోనే రైతులు సా గునీటి విడుదల చేయకుండా క్రాప్ హాలీడే ప్రకటించారు. పంట లు కాపు దశలో ఉన్నా యి. జనవరి చివరి వరకు సాగునీరు అందిస్తే పంట లు చేతికొచ్చేవి. టీబీ డ్యాంలో నీరు లేనందువల్ల మ రో రెండు రోజుల్లో సాగు నీరు నిలిచిపోతుందని ఈఈ విజయ్‌కుమార్ చెప్పారు. ఉన్న ఇండెంట్‌ను డిసెంబ ర్ 15వరకు వాడుకున్నామని, జూరాల డ్యాంలో కూ డా నీళ్లు లేవని యాసంగికి నీరందించలేమని ప్రకటించారు. పంట చేతికొచ్చే దశలో నీళ్లులేక పోవడంతో ఏం చేయాలో తోచడం లేదు. అధికారులు స్పందించి పంటలు కాపాడేందుకు ఈనెల చివరి నాటికి సాగునీరు విడుదల చేయాలి. – శ్రీను, రైతు, మానవపాడు
టీబీ డ్యాంలో నీరు లేనందున సాగునీటి స రఫరాను నిలిపివేశాం. డ్యాంలో నీరు లేనందున ముందుగా వాడుకోవాలని అధికారులు సూచించారు. ఈ మే రకు ఆర్డీఎస్ వాటాగా ఉన్న 2.5 టీఎంసీల నీ టిని డిసెంబర్ 15 వరకు వాడుకున్నాం. జూరాల డ్యాంలో కూ డా నీళ్లు లేవని ముందస్తుగానే యాసంగికి నీటిని అం దించలేమని తెలియజేశాం.