దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), మే 5 : నీటి హౌజ్ లో పడి నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇస్రంపల్లి గ్రామానికి చెందిన కుర్వ రమేశ్‌కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.
కాగా కూతురు నిహాన్సి (4) సోమవారం సాయంత్రం ఇంటిబయట ఆడుకుంటూ వెళ్లి మూతలేని నీటి హౌజ్‌లో పడిపోయింది. ఆ పరిసర ప్రా ంతంలో ఎవరూ లేకపోవడం తో చిన్నారి నీటిలో మునిగి మృతి చెందింది. కుటుంబ స భ్యులు పాప కోసం వెతికగా చివరికి నీటిగుంతలో శవమై తేలడంతో కన్నీరు మున్నీరయ్యారు.