అయిజ, ఆగస్టు 21 : రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోడ కూలిపడడంతో చిన్నారి మృతి చెం దగా మరో నలుగురికి గాయాలైన సంఘటన అయిజలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని 14వ వార్డులో చాకలి నర్సింహులు భార్య రేవతి, కుమారులు ప్రణీ త్, హరీశ్, కూతురు శ్రీకృతితో కలిసి పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. వీరి కూతురు శ్రీకృతి(8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతుండగా.. ఇద్దరు మగపిల్లలు అలంపూర్‌లోని బీసీ వసతి గృహంలో ఉంటూ చదువుతున్నారు.
అయితే రాఖీ పండుగ సందర్భంగా ఇద్దరు కుమారులు ఇంటికి వ చ్చారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు గుడిసెలో నిద్రకు ఉపక్రమించారు. వర్షాలు కురుస్తుండడం.. లోతట్టు ప్రాంతంలో ఉండడంతో గుడిసె వెనుకభాగంలో వర్షం నీరు చేరడంతో తడిచిన గోడ 10 గంటల సమయంలో కూలిపడింది. వెంటనే తేరుకున్న దంపతులు గాయాలైన పిల్లలను బయటకు తీశారు. అయితే శ్రీకృతిపై సెల్ఫ్ బండలు పడడంతో వెంటనే స్థానిక ప్రైవేటు దవాఖానకు తరలించగా.. పరిస్థితి విషమించడంతో కర్నూల్ కిమ్స్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
నర్సింహులుకు స్వల్ప గాయాలు కా గా.. రేవతితోపాటు ఇద్దరు పిల్లలు అయిజ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు న మోదు చేసి చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం ని ర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. అయితే రాఖీ పండుగ రోజే సంఘటన జరగడంతో ఆ కు టుంబంతోపాటు పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. బాధిత కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే వి జయుడు పరామర్శించారు. కర్నూల్ ప్రభుత్వ దవాఖానలో చిన్నారి భౌతికకాయాన్ని పరిశీలించి ఘటన తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వపరంగా ఆదుకునేందు కు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాలిక తల్లి, చి న్నారుల పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వై ద్యం అందించాలని సూచించారు. అలాగే తాసీల్దార్ జ్యోతి, కమిషనర్ లక్ష్మారెడ్డి పరామర్శించారు.