మూసాపేట (అడ్డాకుల), ఫిబ్రవరి 18 : మండలంలోని రాచాలలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఎడ్లబండ్లు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు, బైక్లతోపాటు ఇతర వాహనాలను రంగులతో ముస్తాబు చేసి గ్రామంలో ఊరేగించారు. అనంతరం స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
అదేవిధంగా ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధానఘట్టమైన బండలాగుడు పోటీలను సో మవారం సాయంత్రం నిర్వహించనుండగా, భ క్తులు అధికసంఖ్యలో తరలిరానున్నారు.