పెద్దకొత్తపల్లి, డిసెంబర్ 18 : నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని బాచారం ఫారెస్టు భూముల్లో చెంచులకు పునరావాసం కల్పిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారె స్టు సువర్ణ తెలిపారు. బుధవారం ఎఫ్డీపీటీ సీఎఫ్ రాంబాబు, డీఎఫ్వో రోహిత్ గోపిడి, ఎఫ్డీవో తిరుమల్రావులతో క లిసి బాచారంలో పునరావాసం కల్పించే స్థలాన్ని పరిశీలించారు.
అమ్రాబాద్ అభయారణ్యంలో పులుల సంరక్షణ కోసం అప్పర్ప్లాంట్లోని నివాస గ్రామాలైన కుడిచింతలబైలు, సార్లపల్లి, తాటిగుండా ల, కొల్లంపెంట గ్రామాల ప్రజలకు నివాసం ఏర్పాటు చేసేందుకు అటవీశాఖ భూమిని 1501.88 ఎకరాలను రెవెన్యూ శాఖకు బదలాయించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన అ నంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పం పించడం జరుగుతుందన్నారు. ఆమెవెం ట ఎఫ్డీవో రామ్మోహన్, అమ్రాబాద్ ఎస్డీవో రామ్మూర్తి, ఫారెస్టు రేంజర్లు చంద్రశేఖర్, ఈశ్వర్, ఫారెస్టు సెక్షన్ అధికారి ముజీబ్ ఘోరి తదితరులు ఉన్నారు.