నాగర్‌కర్నూల్, మార్చి 3: ప్రజల నుంచే కవి త్వం బయటకు రావాలని, ఆ దిశగా ఏర్పడి అభ్యుదయ రచయితల సంఘమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గో రటి వెంకన్న అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సింగిల్‌విండో సమావేశ మందిరంలో ఉమ్మడి అభ్యుదయ రచయితల సంఘం జిల్లా మహాసభ లను జిల్లా అధ్యక్షుడు కల్వకోలు మద్దిలేటి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభలకు గోరటి వెం కన్న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ సమసమాజ మార్పుకోసం వ్యవస్థలో సమానత్వం కోసం ఏర్పడిన సంఘమే అభ్యుదయ రచయితల సంఘమన్నారు.
స్వాతంత్య్రం కన్నా ముందే ప్రగతిశీల భావాలతో ఏర్పడ్డ సమాజంలో అభ్యుదయ కవులు ఎంతో మంది పనిచేశారన్నారు. శ్రీశ్రీ, కొడువటిగం టి కుటుంబరావు, బొల్లి ముంత సాంబశివరావు, రాచమల్లు, తాపీ ధర్మారావు, వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్య వంటి ఎందరో మ హాకవులు అభ్యుదయ సంఘాన్ని నడిపారన్నారు. వీరికన్నా ముందు గౌతమ బుద్ధుడు, మహాత్మాజ్యోతిరావుఫూలే, వీరబ్రహ్మం, వేమన, కబీరు, నారాయణగురు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందరో మ హనీయులు పో రాడిన మార్గమే అభ్యుదయ మార్గమని, అరసం సంఘం పుట్టుటకు ఇదే కారణమని చెప్పారు.
జాతీయ నాయకులు వేల్పుల నారాయ ణ మాట్లాడుతూ 1936 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో లో ప్రోగ్రెసివ్ రైటర్స్ ఏర్పడిందని, 1943లో తెనాలిలో మొదటి మహాసభ జరిగిందని, నాటి నుంచి నేటి వరకు తాడిత పీడిత ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక సంఘం అరసం అన్నారు. అదేవిధం గా రాష్ట్ర అధ్యక్షుడు పల్లేరు రామస్వామి, రాష్ట్ర కా ర్యదర్శి రాపోలు సుదర్శన్, పాలమూరు అధ్యయ న వేదిక అధ్యక్షుడు రాఘవాచారి, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏలేశ్వరం వెంకటేశ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమానికి ముందు జెండావిష్కరణ చే పట్టారు.
అనంతరం అరసం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మల్లికార్జున్, సాయిశంక ర్, సీపీఐ రాష్ట్ర నాయకులు ఆనంద్, సీనియర్ జర్నలిస్టు కందికొండ మోహన్, డాక్టర్ భీంపల్లి శ్రీకాం త్, లక్ష్మణ్‌గౌడ్, కవులు వనపట్ల సుబ్బయ్య, వహీద్‌ఖాన్, కాశన్న, శ్యామల, పద్మావతి, విజయ, హరి ణి, లక్ష్మీనర్సిం హ, ప్రతాప్కౌటిళ్య, గుడిపల్లి నర్సింహారెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు సంగం మురళి, రా ములు, ముచ్చర్ల దినకర్, నూనె క్రాంతి, కళాకారు లు కురుమూర్తి, గోపాల్, పర్వతాలు, సంతోష్, సు రేశ్, మధు, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.