భూత్పూర్/ వెల్దండ : కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ( Waqf Lands ) ఆస్తులపై అనుసరిస్తున్న విధానం సరైనది కాదని బీఆర్ఎస్ ( BRS) రాష్ట్ర నాయకుడు మొహమ్మద్ సాదిక్ ( Mohammad Sadiq ) అన్నారు. సోమవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నేషనల్ మైనారిటీ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రంజాన్ (Ramzan) వేడుకల్లో ముస్లిములు నల్ల బ్యాడ్జీలతో ( Black Badges ) నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమలయితే ముస్లిములకు సంబంధించిన ఆస్తులు, భూములు, శ్మశానవాటికలు, మొదలైన వాటిపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుందని ఆరోపించారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిములంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. తమకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సత్తూర్ బస్వరాజు గౌడ్, సత్తూర్ నారాయణ గౌడ్, మురళీధర్ గౌడ్, మైనార్టీ నాయకులు అబూబకర్, ఖదీర్ పాల్గొన్నారు.
వెల్దండలో ..
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ముస్లిం నాయకుడు ఎండీ గౌసుద్దీన్, ఎండీ దస్తగిరి, ఎండీ బాసిద్ పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా వెల్దండ మండలంలోని ఆయా గ్రామాల్లో ముస్లిం నాయకులు రంజాన్ ప్రార్థన సమయంలో ఈద్గాల వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటులో బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రహీం, గౌస్దిన్, రావుఫ్, బాసిద్, కాజా, దస్తగిరి, జమీర్, జాంగిర్, షఫీ సలీం, వహీద్, సమీర్ తదితరులు ఉన్నారు.