Cotton Farmers Protest | రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు.. ఆగ్రహించిన పత్తి రైతులు
Cotton Farmers Protest | కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రోజుకో నిబంధనలు జారీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఊట్కూర్ : సీసీఐ నిబంధనలు (CCI rules ) పత్తి రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వం పత్తి రైతుకు మద్దతు ధర చెల్లించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రోజుకో నిబంధనలు జారీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పత్తి రైతులు సీసీఐ ద్వారా ప్రతిని విక్రయించేందుకు మండలంలోని విజయ కాటన్ ఇండస్ట్రీ వద్దకు వాహనాలతో చేరుకున్నారు. ఉదయం 8:30 గంటలకు కొనుగోలు ప్రారంభించిన అధికారులు ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలనే ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు పత్తి తూకం చేస్తామని స్పష్టం చేశారు.

దీంతో ఆగ్రహించిన పత్తి రైతులు ఎకరాకు 12 క్వింటాళ్ల నిబంధనతో ఆన్లైన్ ద్వారా ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకున్నామని వివరించారు. కొత్తగా నిబంధనలు పెట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొనుగోళ్లను అడ్డుకున్నారు. ఇండస్ట్రీ గేటు ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ఆందోళనకు దిగారు.
నిబంధనల పేరుతో ప్రభుత్వం, అధికారులు పత్తి రైతులను దగా చేస్తున్నారని సీపీవో శ్రీనివాసులును నిలదీశారు. రైతుల ధర్నాతో నారాయణపేట, మక్తల్ పట్టణాల వైపు వెళ్లాల్సిన వాహనాలు దాదాపు గంటపాటు నిలిచి పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఊట్కూరు ఎస్సై రమేష్ ఇండస్ట్రీ వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు.
విషయాన్ని అధికారుల దృష్టికి తెలపడంతో నారాయణపేట జిల్లా మార్కెట్ కార్యదర్శి భారతి, ఏవో గణేష్ రెడ్డి చేరుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తెలిపారు. మధ్యాహ్నం 11:30 గంటల తర్వాత యధావిధిగా ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున పత్తిని కొనుగోలు చేసేందుకు ఆదేశాలు అందినట్లు సీసీఐ అధికారులు ప్రకటించడంతో రైతులు శాంతించి ధర్నాను విరమించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

