గద్వాల అర్బన్, జూన్ 26 : రెండు తెలుగు రాష్ర్టా లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించినట్లు ఎస్పీ తోట శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా కేం ద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో తేజేశ్వర్ హ త్యకు సంబంధించి వివరాలను గురువారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గద్వాల కు చెందిన తేజేశ్వర్(32) ఈనెల 17న డ్యూ టీకి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కిష్టారెడ్డి బం గ్లా సమీపంలో తన బైక్ పెట్టి పని నిమిత్తం వెళ్లాడు.
అయితే తమ విహేతర బంధానికి అడ్డువస్తున్నాడని భావించిన తేజేశ్వర్భార్య ఐశ్వర్య ఆమె ప్రియుడు తిరుమలరావు తేజేశ్వర్‌ను హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో తిరుమల్‌రావు కొం త మందికి సుఫారీ ఇచ్చి హత్య చేయాలని పథకం వేశారు. ఈక్రమంలో సుఫారీ తీసుకున్న వారు తమ కు జోగుళాంబ గద్వాల జిల్లాలో పొలం కొనాలనుకుంటన్నాం..మాకు పొలం చూపించాలని తేజేశ్వర్‌ను ఫోన్లో సంప్రందించారు. దీంతో వారిని కలవడానికి తేజేశ్వర్ వెళ్లగా కర్నూల్ నుంచి గద్వాల వచ్చిన ముగ్గురు కుమ్మరి నాగేశ్, పరశురాముడు, రాజు తేజేశ్వర్‌ను కారులో ఎక్కించుకున్నారు. మా మేనేజర్‌తో మాట్లాడాలని నిందితులు తిరుమలరావుతో తేజేశ్వర్‌ను ఫోన్లో మాట్లాడించారు.
తర్వాత కర్నూల్ వైపు కొద్దిదూరం వెళ్లగా.. మా మేనేజర్ ఫో న్ కలవడం లేదని.. తిరిగి ఎర్రవల్లి వైపు కారు యూ టర్న్ తీసుకొన్నారు. అదును చూసుకొని వారి వెంట తెచ్చుకొన్న కొడవళ్లు, కత్తులతో ముందు సీట్లో కూర్చున్న తేజేశ్వర్‌ను కిరాతకంగా చంపారు. అనంతరం తిరుమలరావుకు సమాచారం అందించి మృతదేహాన్ని సంచిలో కుక్కి కారు డిక్కీలో వేసుకొని అత డి బ్యాగు, ఫోన్లను మార్గమధ్యంలో కృష్ణానదిలో పడేశారు. అలంపూర్ చౌరస్తాలోని పంచలింగాల వెంచర్ వద్ద తిరుమలరావును నిందితులు కలిశారు.
తర్వాత డెడ్‌బాడీని ఏపీలోని పాణ్యం సమీపంలోకి తీసుకెళ్లి నగరి కెనాల్లో మృతదేహాన్ని పడేశారు. నాగేశ్‌కు 19న తిరుమలరావు రూ.50వేలు.. 20న తనకు పరిచయం ఉన్న వారితో రూ.2లక్షలు ముట్టజెప్పారు. కాగా రాత్రయినా తేజేశ్వర్ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో కుటుంబీకులు పలు చోట్ల వెతికారు. లాభం లేకపోవడంతో మరుసటి రోజు గద్వాల టౌన్ పీఎస్‌లో తేజేశ్వర్ కనిపించడం లేదని అతడి అన్న తేజవర్ధన్ ఫిర్యాదు చేశాడు. ఎస్సై కళ్యాణ్‌కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తేజేశ్వర్ బైక్ నిలిపిన ప్రాంతంలో సీసీ కెమెరాను పరిశీలించారు. అతడిని కొందరు కారులో తీసుకెళ్తున్నట్లు నిర్ధారించారు.
ఈ కేసును ఛేదించాలని ఎస్పీ.. డీఎస్పీ మొగిలయ్య, సీఐ టంగూటురి శ్రీనును ఆదేశించారు. గద్వాల టౌ న్, గద్వాల రూరల్, ధరూర్, గట్టు ఎస్సైలను ప్రత్యేక బృందాలుగా నియమించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఏపీలోని కర్నూల్ జిల్లా పాణ్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో ఎవరెవరు ఉన్నా రు..? అన్న కోణంలో ఆరా తీశారు.
ఈ క్రమంలో భయంతో హైదరాబాద్‌కు పారిపోతున్న ఏ-1 తిరుమలరావు, ఏ-3 నాగేశ్, ఏ-5 రాజు, ఏ-4గా పరశురాముడుని పోలీసు బృందాలు పుల్లూరు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఏ-2గా ఐశ్వర్య, ఏ-8గా సుజాత, ఏ-6గా మో హన్, ఏ-7గా తిరుమలరావు తండ్రి తిరుపాలయ్య ను వారి ఇండ్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కారు, 10 ఫోన్లు, జీపీఎస్ పరికరం, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కేసు ను ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.