మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వార్థం కోసం తల్లి లాంటి పార్టీని వదిలి అధికార పార్టీకి వెళ్లిన ఓ మాజీ కౌన్సిలర్‌ను ఆ పార్టీ నాయకులే రెచ్చగొట్టి దూషించేలా చేసి చివరకు కేసు పెట్టి జైలుకు పంపిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. మరోవైపు తనను దూషించిన మాజీ కౌన్సిలర్‌పై చర్య తీసుకోవాలని కార్పొరేషన్ కమిషనర్ మూడు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందంటే సీఎం సొంత జిల్లాలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు పోలీసు యంత్రాంగంపై ఉన్నాయో ఈ ఘటన అద్దం పడుతున్నది. చివరకు అతను మా పార్టీ వాడే కాదని కాంగ్రెస్ నేతలు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పిన కొన్ని గంటల్లోనే పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడం వెంటనే రిమాండ్‌కు తరలించడం చర్చనీయాంశంగా మారింది.
తనను అమ్మనా బూతులు తిట్టిన కౌన్సిలర్‌పై చర్య తీసుకోవాలని కమిషనర్ మొ క్కని అధికారులు లేడు.. వేడుకోని రాజకీయ నాయకుడు లేడు.. కమిషనర్‌ను దూషించిన రా జకీయ నాయకుడిపై చర్య తీసుకోవాలని కార్పొరేషన్ ఉద్యోగులు కలెక్టర్‌ను కలిశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ గెజిటేడ్ ఉద్యోగుల సంఘం కమిషనర్‌పై దాడిని ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. దీంతో ఎంతో హైడ్రామా మధ్య చివరకు మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై తప్పతాగి అసభ్య పదజాలంతో దూషించడంమే కాకుండా కార్యాలయానికి వచ్చి కుర్చీలు ధ్వంసం చేసిన ఘటనలో ఏడోవార్డు మాజీ కౌన్సిలర్ రవికిషన్‌రెడ్డిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వన్‌టౌన్ సీఐ అప్పయ్య వెల్లడించారు.
వివరాల్లోకి వెళితే.. సీఎం సొంత జిల్లాలో ఓ కార్పొరేషన్ కమిషనర్‌ను తన వార్డులో తనకు కాకుండా మరో కాంగ్రెస్ చోటామోటా నాయకుడికి పను లు చేసి పెడుతున్నారని తప్పతాగి తాజా మాజీ కౌన్సిలర్ ఫోన్ చేసి దూషించారు. ఈ ఘటనతో కమిషనర్ ప్రవీణ్ కుమార్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వెంటనే తనను దూషించిన కాంగ్రెస్ నేతపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఆయన తాను నివాసముంటున్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాల్ రావడంతో రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.
ఇది మా పరిధిలోకి రాదు అంటూ చెప్పడంతో.. కార్పొరేషన్ కార్యాలయం పరిధి ఉన్న టూటౌన్ పోలీస్ స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే.. ఇది కూడా మా పరిధిలోకి రాదని తిప్పి పంపించారు. చివరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫి ర్యాదు చేస్తే పట్టించుకునే దిక్కే లేకుండా పో యింది. చివరకు పోలీసులు మాజీ కౌన్సిలర్ కట్టా రవికిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వ దవాఖానకు తరలించి డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేయించారు. అక్కడ తాగినట్లు తేలడం తో ఏం చేయాలో ఆలోచనలో పడ్డారు. ఈలోపు కొందరు కాంగ్రెస్ నేతలు పోలీసులపై ఒత్తిడి చేయడంతో ఆయన్ను వదిలి వేశారు.
ముందు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని పుకార్లు వచ్చాయి. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కార్పొరేషన్ ఉద్యోగులు కమిషనర్‌ను వెంట తీసుకెళ్లి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను టీజీవో తీవ్రంగా ఖండించింది. ఉద్యోగ సంఘాలు కమిషనర్‌కు బాసటగా నిలిచాయి. ఈలోపు కొంతమంది కాంగ్రెస్ నేతలు హడావిడిగా పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టి మాజీ కౌన్సిలర్ కట్టా రవికిషన్‌రెడ్డి అసలు మా పార్టీ వాడే కాదని తేల్చి చెప్పారు. దీంతో ఏమైందో ఏమో కానీ పోలీసులు అతనిపై స్ట్రాంగ్ కేసు నమోదు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఏడో వార్డులో బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందిన కట్టా రవికిషన్‌రెడ్డి పార్టీ అధికారం పో గానే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అయితే ఇటీవల కార్పొరేషన్‌పై కన్నేసిన ఓ కాంగ్రెస్ నేత ఆయా చోట్ల తన అనుచరులకు పనులు ఇస్తూ పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడో వార్డులో కూడా పార్టీ మారిన కౌన్సిలర్‌కు వ్యతిరేకంగా ఒక గ్రూపును తయా రు చేశారు. మున్సిపల్ చివరి సమావేశంలో తీర్మానాలు చేసిన అభివృద్ధి పనులను తన అనుచరుడికి ఇప్పించారు.
తాజా మాజీ కౌన్సిలర్ అయిన తనకు రెస్పాన్స్ ఇవ్వకుండా వేరే కాం గ్రెస్ నేతకు ఇవ్వడంతో రవికిషన్‌రెడ్డి కమిషనర్‌పై దురుసుగా ప్రవర్తించారు. పార్టీలో చేరిన అతన్ని స్టాండ్ బైలో పెట్టి.. ఇన్నాళ్లు పార్టీ కార్యక్రమాల్లో తిప్పుకొని చివరకు గెంటేశారు. దీంతో సదరు మాజీ కౌన్సిలర్ ఇటు అధికార పార్టీ కాకుండా అటు సొంత పార్టీలో లేకుండా పోయారు. ఈ లోపు కమిషనర్‌ను దూషించిన కేసు లో నాటకీయ పరిణామాలు నేపథ్యంలో ఇరికించారు. దీంతో పార్టీ మారిన తాజా మాజీ కౌన్సిలర్‌కు తగిన బుద్ధి చెప్పారని బీఆర్ఎస్ నేత లు అంటున్నారు.
కార్పొరేషన్ కమిషనర్‌ను అసభ్య పదజాలంతో దూషించిన తాజా మాజీ కౌన్సిలర్ కట్టా రవికిషన్రెడ్డిపై కేసు నమోదు చేసే విషయంలో పెద్ద హైడ్రామా చోటు చేసుకుందని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు కొందరు కేసు పెట్టాలని మరికొందరు కేసు వద్ద ని పోలీసులపై ఒత్తిళ్లకు పాల్పడ్డారు. అయితే ఓ ప్రధాన అనుచరుడి సూచన మేరకు హడావిడిగా కాంగ్రెస్ నేతలు ప్రెస్‌మీట్ పెట్టి అతను మా పార్టీ వాడే కాదని తేల్చి చెప్పడం.. క్షణాల్లో పోలీసులు కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి.
తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని తన కు ఈ కేసు నుంచి బయటపడేయాలని సదరు మాజీ కౌన్సిలర్ అనేక మంది నేతలను ప్రాధేయపడినట్లు సమాచారం. చివరకు పార్టీలో చేర్చుకున్నట్లే చేర్చుకొని ఆ వార్డు రిజర్వేషన్లు మార్చి.. అతని అవసరం లేదని చెప్పి ఆ తర్వాత కేసులు పెట్టినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు కేసు చేయాలా వద్దా అని.. చేస్తే స్టేషన్ బెయిల్ ఇవ్వాలా వద్దా అని డైలామాలో పడి ముఖ్యనేతనుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కేసు పెట్టి అరెస్టు చేశారు.
జిల్లా కేంద్రంలోని ఏడో వార్డు (శ్రీనివాస కాలనీ)కి చెందిన మాజీ కౌన్సిలర్ కట్టా రవికిషన్‌రెడ్డి 23.09.2025(మంగళవారం)న మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో అవమానపరచడమే కాకుండా, కమిషనర్ కార్యాలయానికి వచ్చి ప్లాస్టిక్ కుర్చీలను కాళ్లతో తన్నినట్లు వన్‌టౌన్ సీఐ అప్పయ్య తెలిపారు. ఈ ఘటనలో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు వి చారణ నిర్వహించిన అనంతరం నిందితులు కట్టా రవికిషన్‌రెడ్డిని అరెస్టు చేసి బుధవారం ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా జడ్జి జ్యుడీషియల్ రి మాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించినట్లు సీఐ వెల్లడించారు. అనంతరం మాజీ కౌన్సిలర్‌కు బెయిల్ మంజూరైంది.