Car Accident | అచ్చంపేట రూరల్ : శ్రీశైలం ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్కు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో.. ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న డిండి ఎస్ఐ రాజు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం డిండి పట్టణ సమీపంలో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టడంతో జరిగినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.