నారాయణపేట రూరల్, ఏప్రిల్ 24 : జిల్లాలోని వివిధ ఆదర్శ పాఠశాలల్లో మోడల్ స్కూల్ ప్రవేశం కోసం ఆదివా రం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 6వ తరగతి ప్రవేశం కోసం గుండుమాల్, ధన్వాడల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 415 మంది విద్యార్థులకు గానూ 358 మంది హాజరయ్యారు. ఉదయం 10 నుంచి 12 గం టల వరకు పరీక్ష జరిగింది. అలాగే 7 నుంచి 10వ తరగతి వరకు ధన్వాడలో ని ఏ, బీ సెంటర్లతోపాటు గుండుమాల్లో 466 మందికిగానూ 391 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యా హ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష జరిగింది. ధన్వాడలోని పరీక్షా కేంద్రా న్ని డీఈవో లియాఖత్ అలీ, పరీక్షల సంచాలకులు రాజేంద్రకుమార్ పరిశీలించారు. గుండుమాల్లోని పరీక్షా కేంద్రాన్ని ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ యాదయ్యశెట్టి పరిశీలించారు. పరీక్షల ను ఉమాదేవి, అంజలీదేవి, శంకర్నా యక్, రాంలింగం, తిరుపతమ్మ సీఎస్, డీవోలుగా వ్యవహరించారు. ప్రతి విద్యార్థి కొవిడ్ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు.