తాండూర్ : దేశవ్యాప్త సమ్మెలో ( Strike ) కార్మికులు, కర్షకులు పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ( CITU) జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం పిలుపునిచ్చారు. గురువారం తాండూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవో ఎస్ మల్లేశంకు మధ్యాహ్నభోజన కార్మికులతో కలిసి సమ్మె నోటీసును అందజేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా,కార్మిక, కర్షక విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, మధ్యాహ్నభోజన కార్మికులు రెడ్డి మల్లక్క, రామగిరి వరలక్ష్మి, అక్కపెళ్లి కమల, ఎస్కే హసీనా, కార్మికులు పాల్గొన్నారు.