అచ్చంపేటరూరల్: అకాల వర్షం, పిడుగులతో తెలంగాణ రైతులు ఆరుగాలం పండించిన పంట నేలరాలుతుంది. దీంతో పశు సంపదపై ఆదారపడ్డ రైతులు సైతం నష్టలపాలవుతున్నారు. మండలంలోని కొర్రతండా గ్రామంలో శుక్రవారం రాత్రి పిడుగుపడి ( Lightning ) కొర్ర శంకర్‌కు చెందిన రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి.
స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడి ఎద్దులు మృత్యువాత పడి రూ లక్ష నష్టం వాటిలింది. వ్యవసాయంలోసహాయం అందించే ఎద్దులు అకాల వర్షంతో పిడుగు పడి మరణించిన విషయం తెలుసుకొని మాజీ ఎంపీపీ మద్దెల రామనాథం పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహయం అందించేలా చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు.