ఊట్కూర్ : తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా బీఆర్ఎస్దే విజయమని (BRS wins ) బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ( Laxmareddy) , యువజన పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి ( Anand Reddy ) అన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ముందుగా ఆయా గ్రామాల్లో పార్టీ నాయకులు గులాబీ జెండాలను ఎగురవేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న నేటి వరకు అర్హులకు పథకాలు అందని ద్రాక్షలా మారాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అమలు చేసిన పథకాల పట్ల కాంగ్రెస్ ఎగవేత ధోరణిని అవలంబిస్తోందని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన గెలుపు బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు అరవింద్ కుమార్, అశోక్ కుమార్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ ఉబేదుర్ రెహమాన్, ఖాలిక్, రామలింగం గౌడ్, సురేష్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.