మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఉమ్మడి జిల్లాలో స్థానికంపై పట్టు సా ధించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించిం ది. బీసీల రిజర్వేషన్, పంచాయతీల రిజర్వేషన్ తేలా క ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం తుది ఓటర్ జాబితా ఖరారు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు స మయం కాదని అధికార పార్టీ భావిస్తోంది.
2024 జనవరి 31 తో స్థానిక సంస్థలు ఎన్నికల గడువు ముగిసింది. ఇప్పటికే 9నెలలు గడిచినప్పటికీ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించేందుకు జంకుతోంది. అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 10నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకోవడంతో ఎన్నికలకు వెళ్తే ఎదురుదెబ్బ తప్పదనే ఆలోచనతో వెనకడుగు వేస్తున్నది. కాగా, ఈ సారి లోకల్ బాడీ ఎలక్షన్లు నువ్వా, నేనా అన్నట్లు సాగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ సీఎం రేవంత్‌రెడ్డికి సొంత జిల్లా. ఈ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉన్న ది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు దాదాపు 90% వరకు బీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్య విజయం సాధించింది. కోట్లు కుమ్మరించినా గులాబీ పార్టీ గెలుపును ఆపలేకపోయారు. దీం తో అధికార కాంగ్రెస్‌కు బిగ్‌షాక్ తగలడంతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను లాగేందుకు విశ్వప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా ఉండడంతో అధికార పార్టీ ఎన్నికల నిర్వహణకు వెనకడుగు వేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలంపూర్ ఎమ్మెల్యే, ఎ మ్మెల్సీలంతా ఒక్కతాటిపై ఉండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గెలుపునకు కృషి చేశారు. ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయఢంకా మోగించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో తృటిలో అధికారం కోల్పోయినప్పటికీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కాపాడుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. నియోజకవర్గాల్లో పట్టు సడలకుండా పర్యటిస్తూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను నిలదీస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. స్వయంగా మంత్రి ఉన్నప్పటికీ రౌడీ రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. మరోవైపు ఇసుక దందా చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుండగా, అధికారం, పోలీసుల అండదండలతో ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నా గులాబీ సైన్యం వెనుకడుగు వేయకుండా న్యాయపోరాటం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు అంటూ కొంతమంది చేపట్టిన గ్లోబల్ ప్రచారానికి బీఆర్ఎస్ తక్కువ శా తంతో ఓటమి పాలైంది. అధికారం చేపట్టిన కాం గ్రె స్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయకపోవడం తో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నది. పింఛన్లు, రై తు భరోసా, సాగునీరు, పంట నష్టపరిహారం చెల్లించకపోవడం, ఆరు గ్యారెంటీలు అమలు నోచుకోకపోవడం వంటిఅంశాలు అధికార పార్టీని ఉక్కిరిబిక్కి రి చేస్తున్నాయి. గ్రామీణప్రాంతాల్లో నిలదీతలు ప్రా రంభమయ్యాయి. సమస్యలపై బీఆర్ఎస్ నేతలు ఎ క్కడికక్కడ ప్రశ్నిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. దీంతో బీఆర్ఎస్కు మద్దతు లభిస్తున్నది.