BRS Protest | భూత్పూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ ధర్నా
BRS Protest | జిల్లాలోని భూత్పూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది.
మహబూబ్ నగర్ : జిల్లాలోని భూత్పూర్ మండలాన్ని కరువు (Drought ) మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నా ( BRS Protest ) నిర్వహించింది. అనంతరం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateswar Reddy )
ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు లేక నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు యాభై వేల రూపాయలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భూత్పూర్ మండలంలో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని భూత్పూర్ తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలని కోరారు.సీఎం సొంత జిల్లా ను పెద్ద మనసు చేసుకొని పరిహారం అందించాలని సూచించారు.
యాసంగిలో సాగు చేయొద్దు, నీళ్లు, కరెంట్ అడగొద్దు అంటే వ్యవసాయం చేసుకునే వాళ్లు ఎట్లా బ్రతకాలని ప్రశ్నించారు.కృష్ణా నీళ్లను ఒడిసి పట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే జూరాల, కేఎల్ఐ పరిధిలో ఆయకట్టులో పంటలు ఎండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Protest | భూత్పూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ ధర్నా
ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించాలి : అదనపు కలెక్టర్ విద్యా చందన
Dhanu-Dinu | సోషల్ మీడియా వేధింపులు.. ‘ది ట్రైటర్స్’ నటుడు ధనుంజయ్‌పై నటి పోలీసు ఫిర్యాదు
ఉపాధి పనులతో గ్రామాల అభివృద్ధి : జడ్పీ సీఈవో నాగలక్ష్మి
Vanam-PV Ghanam | ‘వనం-పీవీ ఘనం ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

