తిమ్మాజీపేట : వరంగల్లో ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజితోత్సవ సభకు ( BRS Silver Jubilee ) భారీగా తరలిరావాలని ఆ పార్టీ తిమ్మాజీపేట మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్ పిలుపునిచ్చారు. సభకు సంబంధించిన పోస్టర్ను గురువారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు, మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలన్నారు. ప్రతి గ్రామం నుంచి, బీఆర్ఎస్ గ్రామ కమిటీ, ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, విధిగా రావాలన్నారు. గ్రామాల్లో సభ కోసం సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్, విండో వైస్ చైర్మన్ రాందేవ్ రెడ్డి, నాయకులు హుస్సేని, స్వామి, మోహనా చారి, రవీందర్ రెడ్డి, తారా సింగ్, సైఫ్, సలావుద్దీన్, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.