భూత్పూర్, జూన్ 23 : గ్రామాల్లో కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దేవరకద్ర మాజీ ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో పాతమొల్గర, కప్పెట, లంబడికుంటతండా, కొత్తమొల్గర, కరివెన గ్రా మాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ సర్ కార్యక్రమంపై బీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉం డాలని, అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూసుకోవాలన్నారు. గ్రామాలకు కొత్తగా వచ్చిన కోడళ్ల వివరాలు 2002కు సంబంధించిన వివరాలు ఉండాలని చెప్పారు.
అదేవిధంగా డబుల్ ఓట్లు లేకుండా చూసుకోవాలని, కొందరు మహబూబ్‌నగర్, భూత్పూర్‌తోపాటు మీమీ గ్రామా ల్లో ఓటును నమోదు చేసుకుంటారని, ఇలాంటి ఓట్లను తొలగించే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదుపై కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సభ్యత్వం నమోదు సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రె స్ పార్టీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను వివరిస్తూ, ఆ హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైన తీరును వివరించాలని సూచించారు. రానున్న ఎన్నికలు ఏవైనా సరే బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరా రు.
సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండ ల అధ్యక్ష, కార్యదర్శులు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు ఆల శ్రీకాంత్‌రెడ్డి, మన్యనాయక్, మాజీ సర్ప ంచులు సత్తూర్ నారాయణగౌడ్, నర్సింహాగౌడ్, మనెమోని సత్యనారాయణ, ఫసియొద్దీన్, శ్రీనివాస్‌గౌడ్, వెంకట య్య, మాజీ వైస్ ఎంపీపీ నరేశ్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మురళీధర్‌గౌడ్, సత్యనారాయణ, నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డి, నర్సిం హ, శేఖర్‌తోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన మాజీ సర్పంచ్
భూత్పూర్ మండలంలోని పాత మొల్గర గ్రామ మాజీ సర్పంచ్ చిన్ని కృష్ణయ్య, శేఖర్ కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల చిన్ని కృష్ణయ్యకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయసారథిగౌడ్, సంతోష్‌రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.