మహబూబ్‌నగర్ ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ కొడంగల్ గడ్డపై సమరశంఖం పూరించనున్నది. ఈ మేరకు సీఎం సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 10వ తేదీన నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించే రైతు మ హాధర్నాలో పాల్గొంటున్నారు. దీని కోసం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి నియోజకవర్గ వ్యా ప్తంగా రైతులను భారీఎత్తున సమీకరిస్తున్నారు.
ఆ యా మండలాల్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే ఇతర బీఆర్ఎస్ నేతలు మండలాల వారీగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కేటీఆర్ రైతు సదస్సుకు భారీ ఎత్తున తరలించేలా ప్రణాళికలు రచించారు. ఒకవైపు కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో రై తుల భూములను బలవంతంగా లాక్కుంటున్న కాంగ్రెస్ సర్కార్.. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నాలు గు సంక్షేమ పథకాలను కోస్గి నుంచి ప్రారంభించడంతో.. ఈ నేపథ్యంలో కేటీఆర్ కోస్గి పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ చేపడుతున్న రైతు నిరస న మహాధర్నాలు విజయవంతం అవుతుండడం తో.. సీఎం ఇలాకాలో చేపట్టే రైతు మహాధర్నాకు వేలాదిగా తరలించి కాంగ్రెస్ శ్రేణులకు జలక్ ఇ చ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం కోస్గిలో జరిగే రైతు మహాధర్నాకు కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున హాజరుకానున్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని, రైతు భరోసా, ఆత్మీ య భరోసా అందజేయాలని.. సన్న వడ్లు అమ్మిన అన్నదాతలకు బోనస్ వెంటనే చెల్లించాలని తదితర డిమాండ్లతో ఈ మహాధర్నా చేపడుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతు మహా ధర్నాకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతు నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోస్గిలో చేపట్టిన మహాధర్నాకు కేటీఆర్ వస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గుబులు పుడుతున్నది. ఇటీవల సీఎం రేవంత్ ఇచ్చిన హామీల్లో భాగంగా నాలుగు పథకాలను కోస్గి మండలం చంద్రవంచ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు ఆశించినంత జనం రాకపోవడంతో నిరాశపడ్డారు. పెద్ద ఎత్తున ప్ర చారం చేసినప్పటికీ.. కాంగ్రెస్ అమలు చేసిన నా లుగు పథకాల లబ్ధిదారుల ఖాతాలో పడకపోవడంతో ఖంగుతున్నారు. ఈ నేపథ్యంలో కోస్గిలో జరిగే రైతు మహాధర్నాకు కేటీఆర్ వస్తుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా క్లస్టర్ పేరిట గిరిజనుల భూములను లాక్కునేందుకు రేవంత్ సర్కార్ అనేక ప్రయత్నాలు చేసింది. ఇక్కడి రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తిప్పి కొట్టారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని జైలుకు పంపించినా.. బీఆర్ఎస్ నేతలను టా ర్గెట్ చేసిన గిరిజనుల రైతుల పక్షాన నిలబడ్డారు. చివరకు ఫార్మా క్లస్టర్ రద్దయింది. అయితే ఫార్మా క్లస్టర్ భూసేకరణ రద్దు చేస్తూ తిరిగి పారిశ్రామిక కారిడార్ పేరిట కొత్తగా భూసేకరణ చేపడుతున్నది. కొన్నిరోజులుగా రైతులు భూ సర్వేలను అడ్డుకుంటున్నారు. ప్రాణాలకు పోయినా సరే కంపెనీలు రా నివ్వమని తెగేసి చెబుతున్నారు.
వందలాది మంది పోలీసుల సమక్షంలో లగచర్ల రైతులను భయపెట్టి పొలాలను సర్వే చేస్తున్నారు. అయినప్పటికీ రైతులు తిరగబడుతున్నారు. ఈ నేపథ్యంలో లగచర్ల రైతుల పక్షాన కూడా కేటీఆర్ గళం వినిపించే అవకాశం ఉంది.
కోస్గి టౌన్, ఫిబ్రవరి 8: కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణంలో ఈనెల 10వ తేదీన చే పట్టనున్న రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తుడడంతో నిరస న దీక్ష సభ ఏర్పాట్లను శనివారం మాజీ ఎ మ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పరిశీలించారు. సో మవారం ఉదయం 10 గంటలకు కోస్గి మున్సిపాలిటీలోని జూనియర్ కళాశాల మైదానంలో రైతు నిరసన దీక్షకు ఏర్పాటు చేస్తున్నారు. సీ ఎం సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నడంతో పెద్దఎత్తున రైతులను సమీకరించేందుకు మాజీ ఎమ్మెల్యే సమాయతమవుతున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించి కార్యకర్తల స మావేశంలో జన సమీకరణపై దిశా నిర్దేశం చేశా రు. కొడంగల్ రైతు మహాధర్నా పేరుతో నిర్వహించే కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్‌తో పాటు ఉమ్మడి జిల్లాకు చెం దిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూ డా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కోస్గి పట్టణంలో సభా ప్రాంగణం ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే దగ్గరుండి పరిశీలించారు. రైతులు పె ద్దఎత్తున తరలివస్తుండడంతో గ్యాలరీల ఏ ర్పాట్లు చేయాలని ఆదేశించారు. మాజీ ఎ మ్మెల్యే వెంట స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ సభ్యుడు సలీం, గ్రంథాలయ సంస్థ మాజీ చై ర్మన్ శాసం రామకృష్ణ, నాయకులు సాయిలు, జనార్దన్‌రెడ్డి, వెంకట నర్సింహులు ఉన్నారు.
ఎన్నికల్లో వాగ్ధానాలు చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించేందుకు ఈనెల 10వ తేదీన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోస్గికి రాబోతున్నారు. కొడంగల్ గడ్డపై నిర్వహించే రైతు మహాధర్నాను విజయవంతం చేయాలి. రైతులను మోసం చేసి దగా చేసిన కాంగ్రెస్‌కు పరిపాలించే అర్హత లేదు. 420 హామీలను అమలు చేస్తామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. రైతులకు రూ.2లక్షల రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని.. రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలు ఇవ్వాల్సిందే.. కేటీఆర్ రైతు మహాధర్నాకు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి.
– పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడంగల్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల త ర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత ని యోజకవర్గంలో పర్యటిస్తుండడంతో బీఆర్ఎస్ నేతలు భారీఎత్తున జన సమీకరణ చేసేందుకు సమాయత్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లాతోపాటు సమీప నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున రైతులను తరలించాలని కార్యకర్తల కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలు అమలు కాకపోవడంతో రైతుల్లో తీ వ్ర నిరాశ వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటుడం ప్రాధాన్యత సంతరించుకున్నది.