రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
తెలంగాణలో రెండున్నరేండ్లుగా రాక్షస పాలన రాజ్యమేలుతుందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 420హామీలను అమలు చేయాలని అడిగిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తుందని చిట్టెం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూర్ మండలకేంద్రంలో వరిధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు శనివారం రైతులతో కలిసి వడ్ల సంచులతో కలిసి పెద్దఎత్తున ధర్నా చేపట్టారు.
- మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
- ధాన్యం కొనుగోలు నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఆందోళన
అమరచింత, మే 2 : తెలంగాణలో రెండున్నరేండ్లుగా రాక్షస పాలన రాజ్యమేలుతుందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 420హామీలను అమలు చేయాలని అడిగిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తుందని చిట్టెం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూర్ మండలకేంద్రంలో వరిధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు శనివారం రైతులతో కలిసి వడ్ల సంచులతో కలిసి పెద్దఎత్తున ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతులకు 24గంటల ఉచిత కరెంట్‌తోపాటు రెండు పంటలకు పెట్టుబడి సా యంగా రైతుబంధు, సాగునీరు, అవసరమైన ఎరువుల ను ఇబ్బందులు పడకుండా అందించడంతోపాటు పం డించిన పంటను వెంటనే కొనుగోళ్లు చేసి పక్షం రోజుల్లో డబ్బులను అందించామని గురు ్తచేశారు. ప్రసుత్తం సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో రైతులకు పెట్టిబడి సాయంగా ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పిన మాటకు దిక్కులేదని విమర్శించారు. రైతులు సకాలంలో ఎరువులు దొరకక చెప్పులను క్యూలైన్లో పెట్టిన చరిత్ర మిగిలిందన్నారు. ఇప్పటికే రెండు పంటలకు రైతు భరోసా ఎగనామం పెట్టారని ఎద్దేవా చేశారు.
రైతులకు సాయం చేయడంలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి కనీసం వారు పండించిన పంట ను కొనుగోళ్లు చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఆరోపించారు. అప్పులు చేసి పంటను పండించిన రైతు లు వడ్డీలు కట్టలేక ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులకు పంటను విక్రయించి నష్టపోతున్నరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, మాజీ ఎంపీపీలు శ్రీనివాసులు, శ్రీధర్‌గౌడ్, విరేశలింగం, రేచింతల పీఏసీసీఎస్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, మూలమాల్ల స ర్పంచ్ రంగారెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు చెన్నయ్య, రామకృష్ణ, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

