నారాయణపేట, జూన్ 2 : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి విజయం సాధించడం హర్షణీయమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని సత్యనారాయణ చౌర స్తా వద్ద పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్‌కుమార్ రెడ్డి గెలుపుకు కృషి చేసిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు ప్రత్యేక ధన్యావాదాలు తెలియజేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అడ్డాలో ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకోవడం జరిగిందని, ఈ విజయం మరిన్ని విజయాలకు తోడ్పాటు అం దించాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి పనిచేసి విజయ దుందుభి మోగించాలని కోరారు. అ నంతరం పట్టణ ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గురులింగం, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు మహిమూద్, మాజీ మా ర్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జగదీశ్, మాజీ పట్టణ అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, రఘు, శ్రీనివాస్, ప్రకాశ్, అనిల్, దేవరాజ్, అట్టు పాల్గొన్నారు.
మరికల్, జూన్ 2 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నవీన్‌కుమార్‌రెడ్డి విజయం సాధించడంతో ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు జ రుపుకొని స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కస్పే గోవర్ధన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతయ్య, నాయకు లు బసంత్, జగదీశ్, రామస్వామి, అచ్చు శ్రీనివాసులు, చంద్రశేఖర్, మతీన్ పాల్గొన్నారు.
హన్వాడ, జూన్ 2 : స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమా ర్‌రెడ్డి గెలవడంతో ఆదివారం మండల కేంద్రం తోపాటు మునిమోక్షంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుకొన్నారు. ఈ సందర్భంగా ప టాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్య క్రమంలో ఎంపీపీ బాలరాజు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ ఎంపీటీసీ నాగన్న, ఎస్టీ ఎస్ మండల అధ్యక్షుడు హరిచందర్, ఎంపీటీసీలు చెన్నయ్య, వెంకట్రాములు, నాయకులు అన్వర్, బసిరెడ్డి, వెంకన్న, అనం తరెడ్డి, అంజనేయులు, శ్రీనివాసులు, శివకు మార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట, మే 2 : స్థానిక సంస్థల ఎమ్మె ల్సీగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాగర్కుం ట నవీన్‌కుమార్‌రెడ్డి ఘన విజయం సాధించడం తో నవాబ్‌పేట మండలంలో బీఆర్ఎస్ శ్రేణు లు విజయోత్సవ సంబురాలు జరుపుకొన్నా రు. ఆదివారం బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు స్థానిక బస్టాండ్ చౌరస్తాలో పటా కులు కాల్చి విజయోత్సవ సంబురాలు జరుపు కొని స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే ఎన్మన్గం డ్లలో నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపుపై సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మాడెమోని నర్సిం హులు, మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ గోపాల్‌గౌడ్, నాయకులు కృష్ణగౌడ్, మెండె శ్రీను, జైపాల్‌రెడ్డి, తాహేర్, సంపత్, అంజయ్య, గిరియాదవ్, యన్మన్గం డ్ల నాయకులు హన్మంతు, రఘువీర్, గోవిం దునాయక్, హన్మంతునాయక్, రాంచందర్ నాయక్, బుచ్చన్న, చెన్నయ్య పాల్గొన్నారు.
బాలానగర్, జూన్ 2 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపుపై మండల నాయకులు హర్షం ప్రకటించారు. ఆదివారం నవీన్‌కుమార్‌రెడ్డి విజయం సాధిం చడంతో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరా వు, చెన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలూనా యక్, గోపీనాయక్, మంజ్యా నాయక్, తిరుప తినాయక్ తదితరులు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా హైదరా బాద్ వెళ్తున్న నవీన్‌కుమార్‌రెడ్డిని బాలానగ ర్లో నాయకు లు సన్మానించారు.
మూసాపేట(అడ్డాకుల), జూన్ 2: ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపుపై ఆదివారం అడ్డాకులలో సంబరాలు జరుపుకున్నారు. మండలంలోని ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డాకుల బస్టాండ్ ఆవరణలో బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సుజాత, సింగిల్‌విండో చైర్మన్ జితేందర్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, ప్రతాప్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, దానియేలు, మహేశ్‌యాదవ్, జహంగీర్గోరి, కృష్ణయ్యయాదవ్, హుస్సేన్, వెంకట్‌రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్(చిన్నచింతకుంట), జూన్ 2 : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి కాం గ్రెస్ అభ్యర్థిపై 109 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల్ల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు.
మూసాపేట(అడ్డాకుల), జూన్ 2: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపుపై ఆదివారం మూసాపేటలో ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బస్టాండ్ వద్ద బాణసంచా కాల్చి సంబురాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, యూత్ కమిటీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, గద్వాల్ తిరుపతిరెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, నర్సింహులుగౌడ్, మధు, రాజు, నాగేశ్, రమేశ్ పాల్గొన్నారు.
భూత్పూర్, జూన్ 2: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలమూరు నుంచే పతనం ప్రారంభం అయ్యిందని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 109ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ చౌరస్తాలో మాట్లాడారు. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, జూన్ 2 : మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌రెడ్డి విజయం సాధించటంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం జడ్చర్లలో బీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి ఆధ్వర్యంలో మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైస్‌చైర్‌పర్సన్ సారిక, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, ఉమాశంకర్‌గౌడ్, లత, జ్యోతి, మహేశ్, సతీష్, దే వా, బీఆర్ఎస్ నాయకులు మురళి, రంజిత్బా బు, బీకేఆర్, నర్సింహాయాద వ్, కొండల్, న ర్సింహులు, పర్మటయ్య, రాంమోహన్, సురేందర్ పాల్గొన్నారు.
కోస్గి, జూన్ 2 : మహబూబ్‌నగ ర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితా ల్లో బీఆర్ఏస్ పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపొందడం కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటిదాని గ్రంథాలయశాఖ మాజీ చైర్మన్ శాసం రామకృష్ణ అన్నా రు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపునకు సహకరించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లుకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. సమావేశంలో కౌన్సిలర్ జనార్దన్‌రె డ్డి, వెంకట్‌నర్సింహులు, డీకే రాములు, సాయ ప్ప, పోచ్చప్ప, సుభాశ్ పాల్గొన్నారు.
ధన్వాడ, జూన్ 2 : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి విజయం సాధించడంతో ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. ధన్వాడ మెయిన్ రోడ్డుపై పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సుధీర్కుమార్రావు, నాయకులు సత్యనారాయణగౌడ్, శివారెడ్డి, మల్లేశ్‌గౌడ్, శాంతికుమార్, గోపాల్‌గౌడ్, రాములు, భరత్చ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, జూన్ 2 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపొందడంపై బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం పట్టణంలో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. అదేవిధంగా చిట్యాలలో ఎంపీటీసీ చిట్యాల మారుతిగౌడ్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.