జడ్చర్ల/భూత్పూర్/ముసాపేట/అడ్డాకుల/మదనాపు రం, నవంబర్ 20 : కురుమూర్తి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్వామి వారిని దర్శించుకున్నారు. హరీశ్‌రావు వెంట మాజీ మంత్రులు సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గిడ్డంగుల శాఖ మాజీ చైర్పర్సన్ రజనీసా యిచంద్, టీఎస్ఎంఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ రాగా.. వారికి జడ్చర్ల, భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల, కొత్తకోట, మదనాపురం మండల కేంద్రాలతోపాటు నెలివిడి, కొత్తపల్లి, దుప్పల్లిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘ నంగా స్వాగతం పలికారు.
జడ్చర్లలోని త్రీస్టార్ హోటల్ వద్ద ఆగిన మాజీ మంత్రులకు స్థానిక నాయకులు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. భూత్పూర్లో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ పూలమాల, శాలువాలతో స్వాగతం పలికారు. కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, బీఆర్ఎస్ జిందాబాద్, ఆల నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్, హరీశ్‌రావు జిందాబాద్ అం టూ నినాదాలు చేశారు.
తమ అభిమాన నాయకులు వస్తున్నారన్న సమాచారంతో ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ పుష్పలత, మాజీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ సుకేశినీ విశ్వేశ్వ ర్, మాజీ ఎంపీపీ గుంత మౌనిక, మాజీ జెడ్పీటీసీలు కృష్ణ య్య, బాలమణెమ్మ, దేవరకద్ర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి, మాజీ సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, సింగిల్‌విండో వైస్ చైర్మన్ శ్రీనివాసులు, భూత్పూర్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు బాలకోటి, రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.