అమరచింత, మార్చి 15 : ఎన్నో ఏండ్ల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మార్చురీకి పంపిస్తామని అధికార మదంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం సహించదని, వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఆత్మకూర్ మండలాధ్యక్షుడు రవికుమార్‌యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం పార్టీ రాష్ట్ర కమిటీ, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన సస్పెన్సన్ వెంటనే ఎత్తివేయాలని, కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చే స్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో గంటపాటు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రవికుమార్ యా దవ్ మాట్లాడుతూ 60ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు అలుపెరగని పోరాటంతోపాటు 26రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేస్తే ఇదే కాంగ్రెస్ పెద్దలు దిగొచ్చి తెలంగాణను ఇచ్చారన్నారు. చావుకు తెగించి కొ ట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయ్యి నేడు కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించరన్నారు. అనంతరం ఏబీసీడీ వర్గికరణకు చట్టబద్దత కల్పించే వరకు గ్రూప్స్ ఫలితాలను నిలిపివేయాలని వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులకు బీఆర్ఎస్ తరఫున మద్దతు తెలిపా రు. కార్యక్రమంలో ఆత్మకూర్ మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు చెన్న య్య, రామకృష్ణ, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, ఆరేపల్లి పీఏసీసీఎస్ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు రియాజ్అలీ, సీనియర్ నేత మాసన్న పాల్గొన్నారు.