నారాయణపేటరూరల్, జూన్ 13 : కోటకొండ రోడ్డు పనులు వెంటనే పూర్తి చే యాలని కోరుతూ పేట మండలంలోని అప్పక్‌పల్లి వద్ద శనివారం బీఆర్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో కోటకొండతో పాటు వివిధ గ్రామాల నాయకులు, సర్పంచు లు, రైతులు పెద్దఎత్తున పేట-హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు వేపూరి రాములు, సోషల్ మీ డియా వారియర్ కావలి వెంకటేశ్, రా జు, వెంకట్రాములుగౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేట బీ ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.55 కోట్లతో అప్పక్‌పల్లి నుంచి కోయిల్‌కొండ వరకు బీటీ డబుల్ రోడ్డు మంజూరు చేయించగా వాటి పనులు అసంపూర్తిగా మిగిలాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దు య్యబట్టారు.
అప్పక్‌పల్లి నుంచి రోడ్డు ప నులు ప్రారంభించి అమ్మిరెడ్డిపల్లి నుంచి బొమ్మన్‌పాడ్ గేట్ వరకు రోడ్డు పనులను మధ్యలో వదిలేశారన్నారు. దీంతో ఆ రహదారి గుంతలమయంగా మారడం తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రస్తుతం వానకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. రోడ్డు విషయంపై అనేకసార్లు అధికారులను విన్నవించినప్పటికీ ఈ ప్రభుత్వం లో చలనం లేదన్నారు. రోడ్డు పనులు చే స్తున్న కాంట్రాక్టర్‌ను కాంగ్రెస్ నాయకు లు డబ్బులు డిమాండ్ చేయడంతోనే రో డ్డు పనులు మధ్యలో వదిలేసి వెళ్లిపోయారనే ఆరోపణలు ఉన్నాయన్నారు.
అనంతరం బీజేపీ జిల్లా నాయకులు శ్రీనివాస్, కెంచె శ్రీనివాస్, చెన్నప్ప, రవికుమార్ మాట్లాడుతూ రోడ్డు పనులు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు మంజూరు చేయించి ప్రారంభించినప్పటికీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయకుండా మధ్యలో అపేయడం తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనులు పూర్తి చేయకపోతే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, కలెక్టరేట్ ముట్టడిస్తామని నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు లక్ష్మప్ప, రవికుమార్, వెంకట్‌నాయక్, భగవంతు, అరిఫ్, ఖలీల్, ప్రవీణ్, రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.