నారాయణపేట, సెప్టెంబర్ 11 : గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ శివరాజ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైన కారణంగా గురువారం పట్టణంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 29 రద్దు చేసి 55అమలు చేయాలన్నారు.
గ్రూప్-1లో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలన్నారు. సీఎం, టీజీపీఎస్సీ చైర్మన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు నరేశ్, బాలు, శ్రీను, సాయికృష్ణ, వినయ్‌రెడ్డి, శ్రావ ణ్, ఇర్ఫాన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.