జడ్చర్ల, నవంబర్ 9 : కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని జడ్చర్లలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం హోదాలో ఉండి నీచమైన పదజాలంతో మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వెంటనే సీఎంపై చర్యలు తీసుకోవాలని సీఐ ఆదిరెడ్డికి ఫిర్యాదు చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ నవీన్‌చంద్రారెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు బాలు ముదిరాజ్, మండలాధ్యక్షుడు మనోహర్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు సోహేల్, అస్లామ్, శ్రీకాంత్, ప్రసాద్, సాయినాథ్, మహెమూద్, మతీన్, అప్రోజ్, అలీ, అస్తర్ పాల్గొన్నారు.