గద్వాల, జూలై 29 : ప్రజలకు పాలన అందించడంలో కాం గ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో ఎనిమిది నెలలుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కేఎస్ హాల్లో సోమవారం కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రాములు మా ట్లాడుతూ మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
గద్వాల నియోజకవర్గంలో అందరి సహకారంతో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొంటామన్నారు. ని యోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెబుతున్న గద్వా ల ఎమ్మెల్యే ఏయే పనుల నివేదికలను సీఎం ముందు ఉం చారో వివరించాలని డిమాండ్ చేశారు. సమావేశానికి చాలా మంది వచ్చారని, కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసమే ఇందుకు నిదర్శనమన్నారు. కష్టపడి పనిచేసిన వారికే స ముచిత స్థానం కల్పించనున్నట్లు అధిష్ఠానం చెప్పిందన్నారు. కార్యక్రమంలో నాయకులు బీచుపల్లి, పల్లయ్య, జయరామిరెడ్డి, మద్దిలేటి, జనార్దన్‌రెడ్డి, దామోదర్, రాము, సృజన, మగ్బూల్, బాబుగౌడ్, నర్సింహ, కృష్ణ పాల్గొన్నారు.