గద్వాల/ధరూర్, జూన్ 13 : సీడ్ కంపెనీలకు, ఆర్గనైజర్లకు జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ నాయకులు అమ్ముడు పోయారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం రైతు సం క్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లాకు వచ్చిన క్రమంలో సీడ్ పత్తి రైతుల సమస్యలను విన్నవించడానికి వెళ్లిన కుర్వ విజయ్‌కుమార్‌ను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి ధరూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు దళారులకు అండగా నిలిచి పేద సీడ్ పత్తి రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. రైతు కమిషన్ ఎదుట గోడు వెళ్ల బోసుకుందామని వెళ్తున్న సీడ్ పత్తి రైతులను అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించి అక్రమ కేసులు నమోదు చేశారన్నారు.
సీడ్ పత్తి పేరుతో జరుగుతున్న మోసాలను రైతు కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్లకుండా సమస్య ఉన్న ధరూర్, మల్దకల్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో కమిషన్ పర్యటించాల్సి ఉన్న సంబంధం లేని పుటాన్పల్లి గ్రామానికి మార్చారని, ముందస్తు పథకం ప్రకారమే కమిషన్ పక్కదారి పట్టించే విధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారన్నారు. కంపెనీలు, ఆర్గనైజర్లు ఒక ముఠాగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారని ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో రైతు కమిషన్‌కు తాను ఫిర్యాదు చేస్తే స్పందించి కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి శుక్రవారం గద్వాలకు వస్తే స్థానిక కాంగ్రెస్ నాయకులు సీడ్ పత్తి రైతుల సమస్యలను పక్కదారి పట్టించేలా చేశారన్నారు.
రైతులకు న్యాయం చేయాలని రైతు కమిషన్ చైర్మన్ దగ్గరకు వెళితే అక్రమంగా తనను అరెస్ట్ చేసి ధరూర్ పోలీస్ స్టేషన్‌కు తర లించారన్నారు. పుటాన్పల్లి గ్రామంలో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పర్యటించనున్న సందర్భంలో నష్టపోయిన రైతులను ఆయనకు కలిపించి వారికి న్యాయం చేయించాలనే ఉద్దేశంతో రైతు లను అక్కడికి తీసుకెళ్తున్న నన్ను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి రైతుల బాధలు చెప్పకుండా చేశారని మండిపడ్డారు. సీడ్ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించక పోతే సచివాలయాన్ని ము ట్టడిస్తామని హెచ్చరించారు. అ వసరమైతే రైతుల పక్షాన రాష్ట్ర ఉ న్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని వెల్లడించారు.