గట్టు, జూలై 4 : రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దేనని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు పిలుపునిచారు. స్థానిక సంస్థలు ముందున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని స్థానిక అంబాభవాని ఆలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. అంతకుముందు అంబాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
బస్టాండు ప్రాంగణంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యకార్యకర్తలనుద్ధేశిం చి బాసు హనుమంతు మాట్లాడుతూ వంద వాగ్ధానాలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్ర భుత్వం హామీలను అమలు చే యలేక చేతులెత్తేసిందని విమర్శించారు. రుణమాఫీ పేరిట ప్ర భుత్వం రైతులను మోసం చే సిందన్నారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచినా రైతుబం ధు ఊ సెత్తని కాంగ్రెస్ ప్రభు త్వం స్థానిక సంస్థలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతుబంధు నిధులను విడుదల చేసిందని ఎద్దేవా చేశారు. ఈ జిమ్మిక్కు ప్రజలకందరికీ తెలుసునన్నారు.
సీఎంగా కేసీఆర్‌నే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు ముం దున్న నేపథ్యంలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్కు పూర్వ వైభవం తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామల, నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, గాజులపాడు రాఘవేంద్రరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, చక్రధర్‌రావు, అంగడి బస్వరాజు, మహేశ్వరి రాము నా యుడు, పటేల్ జనార్దన్‌రెడ్డి, బీచుపల్లి గోవిందు, మో నేశ్, జయసింహారెడ్డి, వెంకటేశ్, చక్రధర్‌రెడ్డి, రాజు, వెంకటేశ్ నాయుడు, జాంపల్లి భరత్‌సింహారెడ్డి, రాయాపురం వీరేశ్, నూర్‌పాషా పాల్గొన్నారు.
గట్టు, జూలై 4 : మండలంలోని బోయలగూడెం కేకేసీ జిల్లా ఉపాధ్యక్షుడు బీకే వెంకటేశ్, మండల ఉపాధ్యక్షుడు లింగన్న కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరారు. వీరికి బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ నాయకుడు బాసు హనుమంతు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు బస్వరాజు, తిమ్మప్ప, కర్రెప్ప, ఇంజన్న, సురేశ్, గోవర్ధన్, బండమీద తిమ్మప్ప తదితరులు కూడా పార్టీలోకి చేరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామల, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.