వనపర్తి టౌన్, నవంబర్ 9 : పదేండ్లు రాష్ర్టాన్ని సుభిక్షంగా తీర్చిదిద్ది న వ్యక్తి చావు కోరుకునేందుకేనా ప్రజ లు నీకు సీఎం పదవి కట్టబెట్టిందని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై శనివారం ఏఎస్పీ రామదాస్ తేజావత్కు ఫిర్యాదు చేశారు. యా దాద్రి నర్సింహస్వామి సన్నిధిలో మాజీ సీఎం కేసీఆర్‌పై సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడం సిగ్గుచేటన్నా రు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం, అభిమానులు కూడా సమర్థించరన్నారు.
పోలీసులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీధర్, లక్ష్మయ్య, ఉదయ్‌కుమార్, కురుమూర్తియాదవ్, వేణుగోపాల్, కృష్ణ, నాగన్నయాదవ్, తిరుమల్, శ్రీను, దానియేలు, సుబ్బు, నర్సింహ, బాబునాయక్ ఉన్నారు.
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ యూ త్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశా రు. అనంతరం పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అరస్టైన వారిలో గిరి, హేమంత్, జోహెబ్హుస్సేన్, రాము, క్రాంతి, ఆదర్శ తదితరులు ఉన్నారు.