కల్వకుర్తి, ఫిబ్రవరి 17 : బీఆర్ఎస్ నేతలపై నమోదు చేసిన అక్రమ కేసులపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక పాలమూరు చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అధికారం ఉందని విర్రవీగితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతరేసిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల వ్యవహర శైలిని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమనగల్లు మున్సిపాలిటీలో 15 వా ర్డులుండగా, 8 వార్డులను బీఆర్ఎస్, ఆరు వార్డులను బీజేపీ, ఒక్క వా ర్డును కాంగ్రెస్ గెలుచుకుందని, 8 వార్డులు గెలుచుకున్న బీఆర్ఎస్కు చైర్మన్ పదవీ అ ప్పగించకుండా, కాంగ్రెస్, బీజేపీలు అక్రమబంధాన్ని ఏ ర్పాటు చేసుకున్నాయని దు య్యబట్టారు. ఎమ్మెల్యే నారాయణరెడ్డి, బీజేపీ ఆచారికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. ఢిల్లీలో బడేబాయ్, రాష్ట్రంలో చోటేబాయ్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజల చేతితో రెండు పార్టీల నాయకులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమం లో మున్సిపల్ మాజీ చైర్మన్లు ఎడ్మ సత్యం, శ్రీశైలం, మండలపార్టీ అధ్యక్షుడు విజయ్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు బావండ్ల మధు, బీఆర్ఎస్ నాయకులు యాదగిరిరెడ్డి, కిశోర్, గణేశ్, సుశీల, ఈశ్వరయ్య, పాండు, సైదు లు, బోజిరెడ్డి, మధు, తాహెర్‌అలీ, సురేశ్‌తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.