మక్తల్ : ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ ( BRS Silver Jublee ) మహాసభకు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy ) కోరారు. రజతోత్సవ మహాసభ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం మక్తల్ మున్సిపాలిటీలోని పలు కాలనీలల్లో మహాసభ గోడప్రతులను ( Wall Posters ) అతికించారు.
ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుక కోసం 2001, ఏప్రిల్ 27న పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమానికి పునాదిగా వేశారని తెలిపారు. పార్టీ స్థాపన నుంచి స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆంధ్ర వలస పాలకుల చేరల నుంచి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విముక్తి కలిగించారని అన్నారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహోన్నతమైన వ్యక్తిగా కేసీఆర్ ( KCR ) చరిత్రలో నిలిచిపోయానడని తెలిపారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని కొనియాడారు. పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి సాగుకు నిరంధించిన ముఖ్యమంత్రిగా పేరు సంపాదించారని అన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతు బరోసా ద్వారా అండగా నిలిచారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు చిన్న హనుమంతు, గాల్ రెడ్డి, జుట్ల శంకర్, మారుతి గౌడ్, అన్వర్ హుస్సేన్,మన్నన్, అమ్రేష్, సత్య ఆంజనేయులు, ఆనంద్, సాదిక్, కరెం అంజనేయులు తదితరులు ఉన్నారు.