గద్వాల టౌన్, జూలై 10 : ఐదు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం.. గుడ్డు బిల్లు ల చెల్లింపులు లేదు.. నాణ్యత లోపించిన బియ్యం పంపిణీ.. ఇలా ఇవన్నీ చూస్తుంటే మధ్యాహ్న భోజన పథకం కష్టమేనని విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో బిల్లుల చెల్లించకపోవడంతో ఇబ్బందులకు గురువుతున్నామని కాం ట్రాక్టర్లు వాపోతున్నారు. వడ్డీకి తెచ్చుకునే పరిస్థితి ఏ ర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేండ్ల కేసీఆర్ సర్కారులో ఎప్పుడూ బిల్లులు పెండింగ్లో పెట్టలేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులను చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.
ఐదు నెలలుగా బిల్లుల చె ల్లింపు లేదు. ప్రతి నెలా ఇ బ్బందులు పడుతున్నాం. కనీ సం గుడ్ల బిల్లులు కూడా చెల్లించడం లేదు. జీతాలు ఇచ్చేందుకు, సరుకులు కొనేందుకు వడ్డీకి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. కొన్ని నెలలుగా లావు బియ్యం పంపిణీ చేస్తున్నారు. అన్నం సరిగా ఉడకడం లేదు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించాలి.