కొత్తకోట, మే 20 : కనిమెట్ట, పాతజంగమాయపల్లి ప్రజల చిరకాల వాంఛ త్వరలో నెరవేరనున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కనిమెట్ట, పాతజంగమాయపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన పనులను శనివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు గ్రామస్తుల ప్రాణాలను గత పాలకులు గాలికొదిలేశారన్నారు. 300 ఓట్ల కోసం రూ.12 కోట్లు వెచ్చించారని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని, తనకు 300 మంది ప్రాణాలు ముఖ్యమని అ న్నారు. కేసీఆర్ లేకపోతే ఉద్యమం పుట్టుకొచ్చేది కాదని, రా ష్ట్రం వచ్చేది కాదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనందున చింతకుంట, పామాపురం, అప్పరాల గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం జరిగిందన్నారు.
గత పాలకులు వినతులు స్వీ కరించారే తప్పా బ్రిడ్జి గురించి పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ఈ బ్రిడ్జిని రాష్ట్రంలో ఎక్కడా లేని విధం గా ఫైల్ టెక్నాలజీతో శరవేగంగా చేపడుతున్నామన్నా రు. వానకాలం నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కనిమెట్టలో త్వరలోనే డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కనిమెట్ట గ్రామంలో 147 మంది మత్స్యకారులకు కార్డులను పంపిణీ చేశారు. ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. కనిమెట్ట కాంగ్రెస్ మాజీ సర్పంచ్ తిరుపతయ్య భార్య బాలమ్మకు రూ. 38వేల సీఎమ్మార్‌ఎఫ్ చెక్కును అందజేశారు. కా ర్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ మౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, సింగిల్ విండో అధ్యక్షుడు వాసుదేవారెడ్డి, ప్రశాంత్, సర్పంచ్ రాణి, కొండారెడ్డి, బాలకృష్ణ, భీంరెడ్డి, శ్రీను, జగన్, యాదగిరియాదవ్, కోటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.