దోమలపెంట, డిసెంబర్ 5 : నాటక, క్రీడా రంగంలో రాణిస్తున్న నల్లమల ఆణిముత్యం, జెన్కో ఉద్యోగి పలువురితో శభా ష్ అనిపించుకుంటున్నాడు. అమ్రాబాద్ మండలం దోమలపెంట, ఈగలపెంట టీజీ జెన్కోలో 1996నుంచి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా బోయ ఉసేనప్ప విధులు నిర్వర్తిస్తున్నా డు. ఉద్యోగ బాధ్యతలు చేపడుతూనే నాటక రంగంతోపాటు ఇష్టమైన బాల్‌బ్యాడ్మింటన్ క్రీడలో సత్తా చాటుతున్నాడు.
బోయ ఉసేనప్పకు ప్రస్తుతం 52 ఏండ్లు.. 1984 నుంచే క్రీడా, నాటక రంగంలో ఆయన ప్రస్థావం మొదలైంది. క్రీడల్లో అవకాశం వచ్చినప్పుడల్లా బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొం టూ సత్తా చాటుతున్నాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పో టీల్లో మెరిసి ఎన్నో పతకాలు సాధించాడు. ప్రముఖులతో బ హుమతులు, ప్రశంసా పత్రాలు అందుకొని శభాష్ అనిపించుకున్నాడు. టీజీ జెన్కో తరపున నిర్వహించే ఇంటర్ ప్రాజెక్టు బా ల్బ్యాడ్మింటన్ టోర్నీలో పదేండ్ల నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చాడు. ప్రథమ బహుమతి సాధించడంలో ఇతడే కీలకపాత్ర పోషించాడు. 40 ఏండ్ల క్రీడా అనుభవం ఉన్న ఆయన నిత్యం ఎందరో క్రీడాకారులకు శిక్షణనిస్తున్నాడు.
11 ఏండ్ల వయస్సు నుంచే నాటకరంగంపై ఉస్సేనప్ప ఆసక్తి చూపేవాడు. పాఠశాలలో చదివే రో జుల్లో చిల్డ్రన్స్‌డే సందర్భంగా వేసిన ‘జబ్బు కుదిరింది’ అనే నాటకంతో స్టేజ్షో వైపు ఆసక్తి చూపాడు. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. జిల్లా, రాష్ట్ర స్థాయి నాటక ప్రదర్శనల్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. 1987 లో కర్నూల్ జిల్లా స్థాయిలో ఉత్త మ బాలనటుడి అవార్డు పొందా డు. అతడి గురువు లక్ష్మీనాయు డు.. కళామతల్లి ఆశీస్సులతో దూసుకెళ్తున్నాడు. మార్పు.. మా సీతా రాం తాతయ్య.. తం డ్రులున్నారు జాగ్ర త్త.. పిసినారీ పేరయ్య నాటికలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి.
2005లో టీవీ కామెడీ షోలలోకి ఉస్సేనప్ప ప్రవేశించారు. ఈ-టీవీలో ఆంధ్రావాలా షోలో కనిపించారు. 2007లో జీ-టీవీలో కామెడీషో, 2008లో వనితా టీవీలో కామెడీ సర్కస్, డీడీ సప్తగిరి చానెల్లో కామెడీ కితకిత లు.. 2015లో ఈ-టీవీలో జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో నటించాడు. ఇలా దాదాపు 20 ఎపిసోడ్స్ వరకు చేశాడు. 2020లో జీ-టీవీలో అందిరింది షో.. 2021లో హైదరాబాద్ రవీంద్ర భారతి, శిల్పకళావేదిక ఆడిటోరియంలో లైవ్ షోలలో పాల్గొన్నారు. కొన్ని సినిమాల్లో కూడా ఆయన నటించారు.
హీరోయిన్ ప్రియమణి నటించిన చండీ సినిమాలో, జగపతిబాబు నటించిన అధినేత సినిమా లో.. శ్రీకాంత్ నటించిన సేవకుడు సినిమాలో యాక్టింగ్.. కమేడియన్‌గా గుర్తింపు పొందాడు. ఆయన మల్టీపుల్ టాలెంట్‌ను తోటి ఉద్యోగులు, క్రీడాకారులు, స్థానికులు అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ఇలాంటి టాలెంట్ ఉన్న ఉ ద్యోగి తమ జెన్కోలో పనిచేయడం గ ర్వకారణమని శ్రీశైలం లెఫ్ట్ భూగర్భ జల విద్యుత్కేంద్రం చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి కొనియాడారు.