జోగులాంబ గద్వాల : గద్వాల పట్టణంలోని బీడీ కాలనీకి చెందిన సలీం( Saleem) అనే బాలుడు కృష్ణా నదిలోని గూండాల జలపాతం ( Gundala Waterfall ) వద్ద చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యడు. శుక్రవారం స్నేహితులతో కలసి చేపలవేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయాడు. కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని స్థానికులు తెలిపారు.
గల్లంతైన బాలుడు కోసం అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చర్యలు చేపట్టినట్లు గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.తండ్రి మౌలాలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.