మిడ్జిల్, డిసెంబర్ 28 : గాలిపటం తండ్రి లాక్కున్నాడని బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘట న మిడ్జిల్ మండలంలో చో టు చేసుకున్నది. కు టు ంబ సభ్యుల కథనం.. చి ల్వేరుకు చెందిన జక్క రా జు, శ్రీలత దంపతులకు ఒక్కగానొక్క కొడుకు సిద్ధు(9). రాణిపేటలోని ప్రైవేట్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఉదయం గాలిపటం ఎగురవేస్తూ కిందపడ్డాడు. గమనించిన తండ్రి అతడి నుంచి గాలిపటాన్ని లాక్కున్నాడు.
సిద్ధు ఎడవడంతో కొత్తది కొనుక్కోమని తర్వాత డబ్బులు ఇచ్చినా.. తీసుకోకుండా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఏదైనా కావాలని గతంలోనూ బాలుడు ఇలాగే తలుపులు మూసుకుంటుండడంతో తల్లిదండ్రులు తేలికగా తీసుకున్నారు. తర్వాత ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానంతో కిటికీలోంచి గదిలోకి చూడగా.. ఉరేసుకొని కనిపించాడు. వెంటనే గది తలుపులు పగులగ్గొట్టి చూడగా అప్పటికే బాలుడు మృతిచెందాడు. గదిలో నిల్వ చేసిన పత్తిపైకి ఎక్కి చీరతో ఉరేసుకున్నాడు. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.