భూత్పూర్: మండలంలోని కప్పెట గ్రామంలో రెండు రోజులుగా బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి (Ala Venkateswar Reddy) ఈ వేడుకలకు హాజరై ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన అనంతరం బొడ్రాయి( Bodrai ) వేడుకలకు ప్రాధాన్యతను సంతరించుకుందని అన్నారు. ఈ వేడుకలను గ్రామంలోని అన్ని వర్గాల వారు కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవడం గొప్ప విషయమని వెల్లడించారు.
ఇంటి ఆడపడుచులను, అల్లుళ్లను పిలిపించుకొని ఎంతో ఆడంబరంగా వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గ్రామ అభివృద్ధికి నాభిశిల ( బొడ్రాయి) ఎంతో ముఖ్యమని తెలిపారు. ఇలాంటి వేడుకల సమయంలో అందరూ కలిసిమెలిసి ఉండడం ఎంతో బలాన్ని ఇస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కదిరె అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ నరేష్ గౌడ్, మాజీ సర్పంచులు నర్సింలు గౌడ్, వేణు, టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఆశన్న,రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.