గట్టు ఎత్తిపోతల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 3 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ బండ్ నిర్మాణం నుంచి మొదలు పైపులైన్, ఇతరత్రా పనులు నాణ్యతతో చేపడుతున్నారు. నల్లమట్టి విషయంలో రాజీ పడకుండా గుత్తేదారు చర్యలు తీసుకుంటున్నాడు. ఇది వరకే గట్టు, సల్కాపురం చెరువుల నుంచి నల్లమట్టిని తీసుకురాగా.. ఇటీవల 45 కి.మీ. దూరంలో ఉన్న గద్వాల సమీపంలోని కొండపల్లి చెరువు నుంచి నల్లమట్టిని తరలిస్తున్నారు. ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా పూడ్చిన పైపులను వాడకపోవడంతో వాటిని వెలికితీసి నాణ్యతగా ఉన్నాయో లేదో.. పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే వినియోగించనున్నారు. ఇక 953 ఎకరాల భూ సేకరణ విషయంలోనూ ఇబ్బందుల్లేవు. వారంలోగా రైతులకు పరిహారం అందనున్నది. నిర్దేశించిన గడువులోగా 33 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న ప్రణాళికతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే వెలుగు దినపత్రిక మాత్రం లిఫ్ట్ పనులపై విషం కక్కుతూ చీకటి రాతలతో రాద్ధాంతం చేయాలని చూస్తున్నది. ఇలాంటి అసత్యపు రాతలపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– గట్టు, మార్చి 22
గట్టు, మార్చి 22 : ‘గట్టు లిఫ్ట్ గట్టెక్కేనా?’ శీర్షికతో వెలుగు దినపత్రిక చీక టి రాతలు రాసింది. పాతపైపులు, క్వా లిటీ లేని పనులు, వినియోగించని నల్లమట్టి, పూర్తికాని భూసేకరణ, సర్కార్ చిన్నచూపు అంటూ ప్రచురించింది. గ ట్టు ఎత్తిపోతల పనులు వందశాతం నా ణ్యతతోనే జరుగుతున్నాయనేది పచ్చి నిజం. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక సి బ్బంది బుధవారం రిజర్వాయర్ ప్రాం తానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించింది. రిజర్వాయర్ కట్ట నిర్మాణానికి గట్టు, సల్కాపురం చెరువుల నుంచి నల్లమట్టిని తెప్పించి వాడుతున్నారు. గట్టు ఎత్తిపోతలకు 45 కిలోమీటర్ల దూరం లో ఉన్న గద్వాల సమీపంలోని కొండపల్లి చెరువులోని నల్లమట్టి నాణ్యతగా ఉండడంతో అక్కడి నుంచి తరలిస్తున్నా రు. సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడడంలేదు. ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ పనుల్లో భా గంగా పూడ్చిన పైపులను వినియోగించుకోకపోవడంతో.. వాటిని వెలికితీసి ఇక్కడికి తరలించారు.
అయితే, ఈ పైపులను పూర్తిస్థాయిలో ట్రీట్మెంట్ చేసి నాణ్యతగా ఉ న్నాయని నిర్ధారించిన తరువాతే వినియోగించనున్నారు. గట్టు, కేటీదొడ్డి మండలాల రైతుల కల నెరవేర్చే గట్టు ఎత్తిపోతలకు సంబంధించి భూ సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేవు. పట్టాభూమి తక్కువగా, ప్రభుత్వ భూమి ఎ క్కువగా ఉన్నది. రైతులకు ఈ వారంలోనే పరిహారం అందజేసి పనుల్లో వే గం పెంచనున్నారు. సర్కార్ చిన్నచూపే నిజమైతే నడిగడ్డ ప్రాంత పైర్లన్నీ పచ్చదనంతో ఎలా కళకళలాడుతున్నాయనే ది సమాధానం లేని ప్రశ్న. మూడు టీ ఎంసీల సామర్థ్యం గల ఈ ఎత్తిపోతల పూర్తయితే గట్టు, కేటీదొడ్డి మండలాల్లో ని 33వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందనున్నది. గడువులోగా పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.