పర్యాటకులను కనువిందు చేసే కృష్ణ జింకలు రైతుల పాలిట మాత్రం శాపంగా మారాయి. నారాయణపేట జిల్లా మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాల్లో కృష్ణ జింకల బెడద తీవ్ర స్థాయిలో ఉన్నది. జింకల సంతతి భారీ స్థాయిలో పెరిగిపోవడం, నదీ తీర ప్రాంతం కావడంతో ఒక్కో గుంపులో వంద నుంచి 150 జింకలు వచ్చి పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. దీంతో రైతన్నలు బెంబేలెత్తుతున్నారు. కంటిమీద కునుకులేకుండా రాత్రింబవళ్లు పొలాలగట్లపై నిద్ర కాస్తూ పంటలను కాపాడుకుంటున్నారు. వాటి బారి నుంచి పంటలను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు.