అభివృద్ధిలో పార్టీలకతీతంగా భాగస్వాములు కావాలి
ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
టీఆర్ఎస్లో చేరిన వంద మంది బీజేపీ నాయకులు
హన్వాడ, జూన్ 8 : పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ పిలుపునిచ్చారు. బుధవా రం మండలకేంద్రంలో బీజేపీ నాయకుడు పుల్లయ్య, మాజీ ఎంపీటీసీ అంజయ్యతోపాటు వంద మంది కార్యకర్తలు మం త్రి సమక్షంలో టీఆర్ఎస్లో చే రారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మండలంలోని ప్రతి చెరువునూ నింపాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. బీజేపీ మత రాజకీయం, కాంగ్రెస్ కుల రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ముందుగా భువనేశ్వరి ఆలయం నుంచి హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు.
దేశానికే ఆదర్శంగా రాష్ట్ర పథకాలు..
హన్వాడ, జూన్ 8 : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బుధవారం మండలంలోని మాదారం గ్రామంలో రూ.1.73 లక్షలతో చేపట్టిన క్రీడామైదానం, ఇబ్రహీంబాద్‌లో రూ.46 లక్షలతో నిర్మించిన వాటర్‌ట్యాంక్, రూ.10 లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు, రూ. 15 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, పుల్పోనిపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, అయోధ్యనగర్‌లో రూ.16.73 లక్షలతో నిర్మించిన వాటర్‌ట్యాంకు, అయోధ్యనగర్ నుంచి అత్యకుంట తండా వరకు రూ.2.05 లక్షలతో చేపట్టిన బీటీరోడ్డు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొండ్యాలలో బీరప్ప ఆలయం నిర్మాణానికి రూ.5 లక్షలు, అయోధ్యనగర్‌లో రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి రూ.2 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తానని, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.
అనంతరం గొర్రెలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘం రాష్ట్ర చైర్మన్ బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, సర్పంచులు శ్రీదేవి, ర్యాకమయ్య, వసంత, శ్రీనివాసులు, ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, వైస్ ఎంపీపీ లక్ష్మి, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, సింగిల్‌విండో చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజుయాదవ్, ఏపీఎం సుదర్శన్, మాజీ వైస్ ఎంపీపీ కొండాలక్ష్మయ్య, ఎంపీటీసీ శేఖర్, చెన్నయ్య, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, నాయకులు జంబులయ్య, బాలయ్య, రమణారెడ్డి, హరిచందర్, బసిరెడ్డి, నరేందర్, శివకుమార్, సత్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.