నారాయణపేట, మే 6: నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఉదయం పట్టణంలో సత్యనారాయణ చౌరస్తాలో ఎమ్మెల్యేను భారీ గజమాలతో సన్మానించారు. అనంతరం పట్టణం నుంచి వాహనశ్రేణితో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కేక్ కట్‌చేయగా అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గొడుగుగేరి అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సింగారం చౌరస్తా వద్ద పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 48 మంది రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో జిల్లా దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మధ్యా హ్నం ప్రభుత్వ చిన్నపిల్లల దవాఖానలో అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం పట్టణంలోని అనాథ పిల్లల ఆశ్రమంలో ఎమ్మెల్యే కేక్ కట్‌చేసి పిల్లల కోసం వాటర్ కూలర్ ప్రారంభించి చాక్లెట్లు పంపిణీ చేశారు. లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ చిన్నపిల్లల దవాఖానలో తాగునీటి ప్లాంట్ ప్రారంభించారు. 13వ వార్డులో కౌన్సిలర్ నారాయణమ్మ వెంకట్రాములు దంపతులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
మరికల్లో 59కిలోల కేక్ కటింగ్
మరికల్, మే 6: ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం మండలకేంద్రంలో ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా నాయకులు గజమాలతో సన్మానించారు. అనంతరం 59 కిలోల కేక్ కట్‌చేసి సంబురాలు చేసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్ల్లో నాయకులు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మండలకేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో సర్పంచ్ గోవర్ధన్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుమందు ఎమ్మెల్యేకు అదనపు ఎస్పీ నాగేంద్రుడు, బీఎస్పీ సత్యనారాయణ, సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి మర్యాదపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళ, వైస్ ఎంపీపీ రవికుమార్, సర్పంచ్ గోవర్ధన్, ఎంపీటీసీలు గోపాల్, సూజత, మండల కోఆప్షన్ సభ్యుడు మతీన్, సీనియర్ నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజేందర్ గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతయ్య, కార్యదర్శి కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, మండల, జిల్లాస్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో..
మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జన్మదిన వేడులను జరుపుకొన్నారు. ఎంనోనిపల్లి, కిష్టాపూర్, మంత్రోనిపల్లి, కంపాన్పల్లిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధన్వాడ లో బీఆర్ఎస్ కార్యకర్తలు గజమాల, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ, పేట ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు వహీద్, బీఆర్ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్, ఎంపీటీసీ కడపయ్య, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో..
దామరగిద్ద, మే 6: మండలలోని ఆయా గ్రామాల ఆలయాల్లో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండలకేంద్రంలో దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బక్క నర్సప్ప, వైస్ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ భీమయ్యగౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నోట్ పుస్తకాల పంపిణీ
నారాయణపేటరూరల్, మే 6: ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా పీఆర్టీయూటీఎస్ పేట జిల్లాశాఖ, ఒప్పంద ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బీసీ కాలనీలో 200మంది విద్యార్థులకు నోట్‌పుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కన్నా జగదీశ్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఉపన్యాసకుడు రాంరెడ్డి పాల్గొన్నారు.