లింగాల, మార్చి 6 : నల్లమల దట్టమైన అడవిలో.. ప్రకృతి సోయగాల మధ్య వెలసిన పు ణ్యక్షేత్రం భౌరాపూర్. లింగాల మండలం అప్పాపూర్ చెంచుపెంట పంచాయతీ పరిధిలో చెం చుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి కొ లువయ్యారు. క్రీ.శ. 17వ శతా బ్దం నుంచి ఉన్న పురాతన ఆల యం. ప్రాచీనమైన ఆలయం గురించి పలు గ్రంథాల్లో ఉండడం తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో వెలుగులోకి వ చ్చింది.
గువ్వల బాలరాజు నాటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ల గా.. ప్రభుత్వం శివరాత్రి పర్వదినాన చెంచుల పండుగను నిర్వహిస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా ఈసారి 7, 8వ తేదీల్లో జాతర నిర్వహణకు ప్రభుత్వపరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శివరాత్రి రోజు భ్రామరి, మల్లికార్జునస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. చెంచు సంస్కృతి, సంప్రదాయం ప్రకారం కుల పెద్దల సమక్షంలో ఏటా కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు.
చెంచులు తమ ఆరాధ్యదైవంగా లింగమయ్య తర్వాత భౌరాపూర్లోని స్వామిని కొలుస్తారు. భ్రామరిని తోబుట్టువుగా భావిస్తారు. వేట కోసం వచ్చిన మల్లికార్జున స్వామి లోకకల్యాణార్థం భువిలో వెలసిన భ్రమరాంబను వివాహం చేసుకుంటాడు. దీం తో స్వామిని చెంచులు మల్లన్న బావగా పిలుచుకుంటారు. అం దుకే ఇక్కడ చెంచులే పూజారులుగా వ్యవహరించే సంప్రదా యం నేటికీ కొనసాగుతున్నది. శ్రీశైల క్షేత్రానికి వెళ్లే భక్తులు, అడవిలో వెళ్లే బాటసారులు, వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి చెరువును నిర్మించారు. భౌరాపురంలోని భైరవుడిని పూజిస్తే ఎలాం టి భయం ఉండదని, క్రూరమృగాలు సైతం దాడులు చేయవని భక్తుల నమ్మకం. ఎంతో వైభవంగా విరాజిల్లిన ఆలయం నేడు పూజలకు నోచుకోలేని స్థితికి చేరుకున్నది.