భూత్పూర్: మండలంలోని రావులపల్లి వాగు నెల రోజుల నుంచి పారుతుండంతో వంతెనపై పాకర చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతన్నట్లు గ్రామస్తులు, సర్పంచ్ శ్రీనివాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం అధికారులతో కలిసి వంతెనను పరిశీలించారు.
ఈ వంతెనపై రాకపోకలు సాగిస్తూ చాలామంది గాయాల పాలైనట్టు ఎమ్మెల్యేకు తెలిపారు. కాగా గ్రామస్తుల కోరిక మేరకు వంతెన ఎత్తును పెంచేందుకు అధికారులతో ప్రణాళికలు తయారు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీఆర్ డీఈ రామకృష్ణ, ఎంపీపీ కదిరె శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ రజిత, ఉప సర్పంచ్ శ్రీశైలం, గ్రామస్తులు పాల్గొన్నారు.
పేదలకు వరం కల్యాణలక్ష్మి
మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని గాజులపేట, ఇప్పలపల్లి గ్రామాలకు చెంది న 11మంది అబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం పేదల పాలిట వరమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు వెంకటయ్య, శేఖర్, ఎంపీ టీసీ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.