వంగూరు, జూలై 19 : సీఎం కేసీఆర్ నే తృత్వంలో సర్కారు బడులకు మహర్దశ చేకూరిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో రూ.12లక్షలతో చేపట్టి న పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు పాఠశాలలకు సన్నబియ్యం, ఉచిత పుస్తకాలతోపాటు మౌలిక సదుపాయాలను క ల్పిస్తుండటంతో విద్యార్థులు ఎక్కువగా చే రుతుండడంతో 100శాతం హాజరు పెరిగిందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వా లు విద్యావ్యవస్థపై చిన్నచూపు చూశాయ ని, నేడు సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన వి ద్యను అందుబాటులోకి తీసుకొచ్చారన్నా రు. అంతకుముందు గ్రామంలో కలియ తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. గ్రా మాభివృద్ధికి పార్టీలకతీతంగా అందరూ క లిసి రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మ, బీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు కృష్ణారెడ్డి, జెడ్పీ కోఆప్షన్ స భ్యుడు హమీద్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్, ఎంపీడీవో వి జయభాస్కర్, ఎంఈవో శంకర్, నాయకులు గణేశ్‌రావు, రాజేశ్వర్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, నర్సింహారెడ్డి, దేవా, జంగయ్య, నాగేశ్, ప్రవీణ్‌రెడ్డి, మొగులయ్య, ఎల్లాగౌ డ్, నర్సిరెడ్డితోపాటు ఉపాధ్యాయులు, వి ద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.