Narayanapet | మరికల్, జూన్ 01 : మరికల్ మండల కేంద్రంలోని సరస్వతి కాలనీలో ఇటీవల నూతనంగా నిర్మించిన సరస్వతి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి సూచించారు. ఆదివారం సరస్వతి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లాలో సరస్వతి దేవి మందిరం మరికల్లో ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శివప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు దుబాయ్ రాములు, ఆశప్ప, హరి ప్రసాద్‌తోపాటు రాజు, అశోక్ కుమార్, లక్ష్మీ కాంత్ రెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.